Wednesday, February 9, 2011

ఇంతకీ 'సంక్రాంతి 2011' తెలుగు సినిమా భాక్సాఫీస్ విజేత ఎవరు?





ఈ సంక్రాంతికి నాలుగు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద నిలబడ్డాయి.వాటిల్లో మొదట బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ పరమవీరచక్ర చెప్పుకోవాలి. దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్ తో నిర్మాణమైన ఈ చిత్రం రెండుకోట్లు కూడా సంపాదించుకోలేనంత ప్లాప్ టాక్ తెచ్చుకుని మొదటి రోజే చతికిలపడింది. ఇక రెండో చిత్రం రవితేజ, హరీష్ శంకర్ లకాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్. డివైడ్ టాక్ తెచ్చుకున్నా రవితేజకు ఉన్న క్రేజ్, కామిడీగా ఉందని టాక్ రావటం ఈ చిత్రానికి ప్లస్సై కమర్షియల్ గా నిలబడటానకి దోహదం చేస్తోంది. ఈ చిత్రం ఉన్నంతలో బెటర్ అనీ కొన్నవారికి లాభాలు తేకపోయినా నష్టాలు తేదని నమ్మకంగా చెప్పుతున్నారు. కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ ఇది హౌస్ ఫుల్స్ నడుస్తోంది.అందులోనూ మిగతా సినిమాలు చతికిల పడటం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక మూడో చిత్రం రాఘవేంద్రరావు కుమారుడు కె.సూర్య ప్రకాష్.డిస్నీవారితో కలసి చేసిన ఫాంటసీ అనగనగా ఒక ధీరుడు. ఈ చిత్రం అనగనగా ఒక బోరుడు అనే టాక్ తెచ్చుకుంది. గ్రాఫిక్స్ బాగున్నా కథ లేకపోవటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బావురుమంటోంది. దర్శక,నిర్మాతలు,హీరో,హీరోయిన్స్ టీవీ ఛానెల్స్ లో కూర్చుని ఎంత పబ్లిసిటీ చేస్తున్నా వర్కవుట్ అయ్యేటట్లు కనపడటం లేదు. ఇక నాలుగో చిత్రం సుమంత్, ఇంద్రగంటి మోహన్ కృష్ణల గోల్కొండ హైస్కూల్. ఇది ప్రేక్షకులుకు రుచించని ఆర్ట్ ఫిల్మ్ లా తయారైందని టాక్ తెచ్చుకుంది. స్లో నేరేషన్, వినోదం అస్సలు లేకపోవట ఈ చిత్రానికి మైనస్ గా నిలిచి మహా నసగా మారాయని చెప్తున్నారు

No comments: