Wednesday, February 2, 2011

ఒక పక్క క్రికెట్ ప్రపంచ కప్.....




ఒక పక్క క్రికెట్ ప్రపంచ కప్, మరో పక్క పరీక్షలు దగ్గర పడటంతో ఫిబ్రవరి నెలలో తెలుగు  సినిమా పరిశ్రమలో సినిమాల విడుదల హడావిడి ఒక్కసారి ఊపందుకుంది. ప్రపంచ కప్ మొదలైతే సినిమాల గురించి జనాలు పట్టించుకోరనే తలంపుతో ఈనెల మూడో వారం లోపే సినిమాలన్నీ విడుదల చేసెయ్యాలని నిర్మాతలు కింద మీద పడుతున్నారు. 

ఆ క్రమంలో తోలి వారం ఫిబ్రవరి 4న ఏ విధమైన పోటీలేకుండా సోలో గా రిలీజ్ అవుతున్న చిత్రం 'జై భోలో తెలంగాణా"

సందేసాత్మక చిత్రాలను వినోదంతో కలిపి రూపొందించే దర్శకుడు యన్. శంకర్  స్వీయదర్శకత్వంలో తెలంగాణ ఉద్యమ నేపద్యంలో 'జై భోలో తెలంగాణా' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం లో జగపతి బాబు ప్రత్యెక పాత్రలో నటించారు. హిందీ నటి స్మ్రుతి ఇరానీ తెలంగాణా తల్లి పాత్ర పోషించారు. తెలంగాణా ఉద్యమ స్వరూప స్వభావాలను తెలంగాణా ప్రజలకు తెలియజెప్పే సినిమాగా అభివర్ణించిన ఈ చిత్ర విజయం ఫై శంకర్ ధీమాగా ఉన్నారు.

ఆతరవాత రెండో వారం లో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

మొదటిగా ఫిబ్రవరి 10 న 'కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం: అప్పలరాజు'

రామ్ గోపాల్ వర్మ తెలుగు సిని పరిశ్రమ ఫై విసురుతున్న విమర్సనాస్త్రం గా ఈ చిత్రాన్ని చెప్పుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను వినోదభరితంగా తెరకెక్కించినట్టు సినిమా ప్రచారం చూస్తుంటేనే తెలుస్తుంది. సునీల్ తో పాటు దాదాపు తెలుగు సినిమా కామెడీ ఆర్టిస్టులు అందరు నటించిన ఈ సినిమా విడుదల కోసం పరిశ్రమ, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫిబ్రవరి 11 న 'గగనం' విడుదల అవుతుంది.

కింగ్ నాగార్జున ప్రయోగాత్మక చిత్రంగా గొప్పగా చెబుతున్న 'గగనం' తమిళ తెలుగు బాషలలో ఒకే సారి విడుదల కాబోతుంది. పాటలు లేకుండా, కిడ్నాప్ నేపద్యం సాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, రాధా మోహన్ దర్శకత్వం వహించారు.

వస్తాడు నా రాజు కూడా ఫిబ్రవరి 11 నే..!

మంచు విష్ణు తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తూ నటిస్తున్న సినిమా 'వస్తాడు నా రాజు' లో తాప్సీ కధానాయకిగా చేస్తుంది. యూత్ ఫుల్ లవ్ స్టొరీ గా చెబుతున్న ఈ సినిమా తో హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

'కుదిరితే కప్పు కాఫీ' ఫిబ్రవరి 11

రమణ సెల్వ తోలి సారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో వరుణ్ సందేశ్ హీరో కాగా, సుమ భట్టాచార్య హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ స్టొరీ గా చెబుతున్న ఈ సినిమా తో సీతారామశాస్త్రి కొడుకు యోగింద్ర శర్మ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఫిబ్రవరి నాలుగో వారం లో కూడా నాలుగు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

ఎర్ర గులాబీలు

సమీరారెడ్డి, సమంత ప్రధాన పాత్రలలో గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ థ్రిల్లర్ సినిమా జనాలను భయపెట్టబోతుంది.

కిలాడీ

విశాల హీరోగా తమిళం లో విడుదలైన 'తీరడా విలైయట్టు పిళ్ళై' సినిమా తెలుగు అనువాదంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆహా నా పెళ్ళంట..!

నరేష్ హీరోగా వీరభద్రం చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన ఈ కామెడీ సినిమా నవ్వుల విందు చేయనుంది.

రాజ్:

సుమంత్ హీరోగా ప్రియమణి, విమల రామన్ హీరోయిన్లుగా రూపొందించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని కుమార్ బ్రదర్స్ నిర్మించగా వి.యన్.ఆదిత్య దర్శకత్వం వహించాడు.

ఈ నెలలో దాదాపు పది సినిమాలు మూడువారాల వ్యవదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

No comments: