నందమూరి బాలకృష్ణ త్వరలో మంచు మనోజ్ తాజా చిత్రం ఊ కొడతారా...ఉలిక్కి పడతారా లో గెస్ట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర కీలకమై నిలుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మోహన్ బాబుకీ, బాలయ్యకీ ఉన్న అనుబంధంతో ఈ చిత్రంలో చేయటానికి కమిటయ్యాడని చెప్పుకుంటున్నారు. ఇక త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు రూపొందనుందని చెప్తున్నారు. ఇక ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న..
తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది. ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ..కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా’ అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు.అలాగే ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.

No comments:
Post a Comment