Thursday, February 24, 2011

ఆడపిల్లను ప్రసవించిన చందమామ సింధూ మీనన్





చందమామలో మంచి ఈజీనెస్ చూపిన సింధూ మీనన్ ఆ తర్వాత తెలుగులో బిజీ కాలేకపోయింది. దాంతో యుకె కి చెందిన బిజెనెస్ మ్యాన్ ప్రభుని లాస్ట్ ఇయిర్ వివాహం చేసుకుంది. రీసెంట్ గా ఓ ఆడపిల్లకు తల్లి అయింది. హాస్పటిల్ లో ప్రసవమైన సింధు, ఆమె బిడ్డ కులాసాగా ఉన్నారు. ఇక సింధూ మీనన్ మొదట శ్రీహరి చిత్రం భధ్రాచలం చిత్రం లో చేసింది. ఆ తర్వాత శివాజీ సరసన 'శ్రీరామ చంద్రులు' చిత్రంలో కనిపించింది. అలా అప్పుడప్పుడూ అవకాశాలు వచ్చిన ఆమె తన సొంత భాష మళయాళంలోనూ బిజీ కాలేకపోయింది. కెరీర్ చివరి దశలో ఆమె తమిళంలో చేసిన ఈరమ్ చిత్రం మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కన్నడంలో చేసిన హూలియా అనే చిత్రంలోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆమె చివరగా తెలుగులో చేసిన సుభధ్ర చిత్రం ఇంకా విడుదల కాలేదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి కామిడీని గతంలో అందించిన రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శ్రీకాంత్ టాకీస్ పతాకంపై ఇ.శ్రీకాంత్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు

No comments: