Sunday, February 27, 2011

ఎమ్మెల్యే తనయుడి పెళ్లిలో చిరంజీవికి చేదు అనుభవం




హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో తీవ్ర పరాభవం ఎదురయింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రెడ్యానాయక్ రెండో కుమారుడి వివాహానికి ఆదివారం చిరంజీవి వచ్చారు. పెళ్లి కొడుకు ఎమ్మెల్యే కవిత సోదరుడు కూడా. ఈ పెళ్లి ఎల్బీ నగర్‌లోని చంపాపేటలోని పుల్లారెడ్డి గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ పెళ్లికి చిరంజీవిని ఆహ్వానించారు. అయితే పెళ్లికి వచ్చిన చిరంజీవిని పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు.

చిరును తెలంగాణవాదులు అడ్డుకొని తెలంగాణ వ్యతిరేకి అయిన చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనాలన్నారు. అయితే చిరంజీవి వారి మాటలను ఏమీ పట్టించుకోకుండా లోనికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. అయితే జై తెలంగాణ అంటేనే లోనికి పంపిస్తామని తెలంగాణవాదులు చెప్పారు. దీంతో ఆయన చిరు నవ్వుతో అక్కడినుండి సెక్యురిటీ మధ్య బయటకు వచ్చేశారు. వివాహ వేడుకలో రసాభాస జరగడం తనకు ఇష్టం లేనందునే అందుకే తిరిగి వచ్చానని ఆయన చెప్పారు.

1 comment:

Anonymous said...

piccha naa kodukulu ekkada elaa behave cheyaalo koodaa teliyani vedavalu..