సినిమాలు ఫ్లాప్‌కు కథ కారణం. ప్రతి ఇండస్ట్రీలోనూ కథా లోపం ఉంది అని సమాధానమిచ్చారు ప్రకాష్ రాజ్. తెలుగు సినిమా రంగం సంక్షోభంలో ఉందనే అభిప్రాయం ఉంది. దానిని దారిలో పెట్టడానికి ఏదైనా సలహా ఇస్తారా అని ఆడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. అలాగే సంక్షోభం నుంచి బయిటపడటానికి ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నాం. కాస్ట్ కటింగ్ పెట్టాం. అమలు చేస్తున్నారు అన్నారు. ఇక తాను హీరో కాలేను అనే విషయం చెపుతూ.. నేను హీరో కావాలని ఎప్పుడూ అనుకోనండి. నేను నటుడిగా ఉండడం గర్వంగా ఫీలవుతున్నా. ఒక తండ్రి పాత్ర.. ఒక విలన్ పాత్ర ఏదైనా చేయగలను. హీరో పాత్ర చేస్తే.. 20 సంవత్సరాలు ఒకే మొహంతో, ఒకే హెయిర్ స్టైల్‌తో ఉండలేను. నా వల్ల కాదు అని నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. ఓ లీడింగ్ న్యూస్ ఛానెల్ తో ఆయన ఆదివారం రాత్రి ఎడిటర్ తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఇలా స్పందించారు. ఇక ప్రకాష్ రాజ్ రీసెంట్ గా గగనం చిత్రం తమిళంలో పయినం పేరిట నిర్మించారు. రాధామోహన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.
No comments:
Post a Comment