Monday, February 28, 2011

రామ్ గోపాల్ వర్మ ఏమీ చిరంజీవిలా దద్దమ్మలా చూస్తూ ఊరుకోడుగా?

రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా చరిత్రకి తనదైన ముద్ర వేసినటువంటి దర్శకుడు. అలాంటి రామ్ గోపాల్ వర్మపై ఇటీవల టివి9 ఓ కధనం ప్రసారం చేసింది. దానిపేరు రామ్ ఢమాల్ వర్మ. సాధారణంగా మెరుగైన సమాజం కోసం ఛానెల్ పెట్టుకున్నామని తమ గురించి చాలా గోప్పగా చెప్పుకునే ఛానెల్స్ మాత్రం వాళ్శకి ఎవరైనా గిట్టని వారిపై మాత్రం ఎప్పటికప్పుడు బురద చల్లుతూ ఓ విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పోందుతున్నారనేది వాస్తవం. సమాజంలో వాళ్శు టాప్ రేటేడ్ ఛానెల్ అనే డిగ్నిటీ మర్చిపోయి ఒక్కోసారి వారియొక్క పర్సనల్ విషయాలపై ఎక్కువ ఆశక్తి చూపిస్తూఉంటారు. ఇటీవల కాలంలో దీనికి ఉదాహరణ రామ్ గోపాల్ వర్మ.

ఇటీవల రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి అప్పల్రాజు సినిమాపై ఓ ఛానెల్ విరుచుకుపడింది. రామ్ ఢమాల్ వర్మ అంటూ అతనిపై గంట సేపు ప్రోగ్రాం వేసి వర్మ మీద ఉన్నటువంటి కసిఅంతా తీర్చుకున్నారు. వర్మపై వారికి ఏ పర్సనల్ గ్రడ్జ్ ఉందేమో తెలీదు గానీ, తనపై వచ్చినటువంటి విమర్శలకు సరదాగా కౌంటర్స్ ఇచ్చేటటువంటి వర్మ ఈసారి మాత్రం ఆఛానెల్‌పై విరుచుకుపడ్డారు. ఏకంగా ఆఛానెల్‌పై క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా సిద్దమయ్యారని సమాచారం.

గతంలో చిరంజీవి ఫ్యామిలీపై వారు నటించినటువంటి చిత్రాలపై ఛానెల్ చాలా కార్యక్రమాలు ప్రసారం చేసింది. కానీ వారికెవరికీ దానిపై యాక్షన్ తీసుకునే దమ్ము లేకపోయింది. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఏమీ చిరంజీవిలా దద్దమ్మలా చూస్తూ ఊరుకోడుగా? అందుకే వాళ్శపై యాక్షన్ తీసుకోవడానికి సిద్దమయ్యాడంటూ కొందరు సినీ జనాలు కామెంట్ చేసుకుంటున్నారని వినికిడి.

No comments: