Friday, February 11, 2011

కాంగ్రెస్‌లో విలీనం అవ్వడం వల్లే రామ్ చరణ్ అలా ఇబ్బంది పడుతున్నాడా...?





కాంగ్రెసుతో ప్రజారాజ్యం విలీనం చేసి మెగా జోకర్‌గా మిగిలిన చిరంజీవిపై ఇప్పుడు ఫిలిం నగర్‌‌లో ఆయనంటే ఇష్టం లేని వాళ్శు ఇప్పుడు తెగ జోకులు వేసుకుంటున్నారని సమాచారం. ఒకప్పుడు చిరంజీవి పేరు పలకడానికి కూడా భయపడిన వాళ్శంతా ఇప్పుడు చిరంజీవిగారి గురించి పబ్లిక్‌గా జోకులు వేసుకుంటున్నారు. పాలిటిక్స్‌‍లో ఎన్టీఆర్ తర్వాత అంతటోడినంటూ వెళ్శిన చిరంజీవి పార్టీ పెట్టిన రెండున్నర సంవత్సరాలకే, పార్టీని నడపలేకపోతున్నానంటూ చేతులేత్తేయడంతో మెగా ప్యామిలీకి సంబంధించినటువంటి సభ్యులు ఫిలింనగర్‌లో తలెత్తుకోలేక పోతున్నారని సమాచారం.

ఇక మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ ఐతే అసలు బయటకి వెళ్శడమే మానివేశాడంట. హైదరాబాద్‌లో లేకుండా తిరుగుతున్న రామ్ చరణ్ ఒకవేళ ఇక్కడికి వచ్చినా కనీసం ఇంట్లో ఉన్నటువంటి నౌకర్లుకు కూడా తన ముఖం చూపించలేక బయటక కూడా రావడం లేదంట. ఒకప్పుడు చిరంజీవి కోడుకునని గర్వంగా చెప్పుకున్న రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు ఇలాంటి అవమానానికి తలవంచుకోవాల్సిన పరిస్దితి వచ్చిందని తన సన్నిహితుల వద్ద భాదపడుతున్నాడంట.

No comments: