Friday, February 11, 2011

'రగడ' గురించి ప్రశ్నిస్తే కోపం తెచ్చుకున్న నాగార్జున.....





'రగడ' మీరు ఆశించినంత హిట్టయ్యిందా అని మీడియావారు అడిగిన ప్రశ్నకు నాగార్జున ఆవేశం తెచ్చుకున్నారు. ఆయన ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ...'రగడ' నా సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ అండీ. చూశారా. మీకు అదెంత హిట్టో తెలీదు. 'మన్మథుడు' చేశాక, నన్ను అదే పేరుతో పిలుస్తూ, దాన్ని చాలా హిట్టంటూ వచ్చారు. దానికంటే ఆ టైమ్‌లో వచ్చిన 'సంతోషం', 'నేనున్నాను' పెద్ద హిట్లు. కానీ వాటికంటే 'మన్మథుడు'కే ఎక్కువ ప్రచారం వచ్చింది. కారణం మీరే...మీ మీడియానే అంటూ నాగార్జున సమాధానమిచ్చారు. నాగార్జున తాజా చిత్రం గగనం ప్రమోషన్ సందర్భంగా ఆయన మీడియాని కలిసారు. ఇక 'రగడ' చిత్రం రిలీజైన మొదటి వారానికే చాలా ధియోటర్లలో తీసేసారు. అయినా పబ్లిసిటీతో నాగార్జున దానిని నిలబెట్టాలని ప్రయత్నించారు.వీరూ పోట్ల ఆ చిత్రాన్ని రూపొందించారు. అనుష్క, ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేసారు.

No comments: