Thursday, February 10, 2011

కాజల్ కమిటైన హిందీ చిత్రం పూర్తి వివరాలు.....




కాజల్ త్వరలో హిందీలో కి పరిచయం కానుంది. సూర్య, అనుష్క కాంబినేషన్ లో వచ్చిన తమిళ సింగం(యమడు) చిత్రం రీమేక్ లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. గోల్ మాల్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించి హాట్ డైరక్టర్ గా మారిన రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. మొదట ఈ పాత్రకు గానూ అనుష్కను అడిగారు. కానీ అనుష్క డేట్స్ ఖాళీగా లేకపోవటంతో ఈ ఆఫర్ కాజల్ ని వరించింది. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ఇక రోహిత్ శెట్టి..ఆమె నటించిన మగధీర,డార్లింగ్ వంటి చిత్రాలు చూసి ఆమెను ఎంపికచేసినట్లు చెప్తున్నారు.

No comments: