Friday, February 18, 2011

హీరోయిన్ చెల్లెళ్శతో సరసాలాడుతూ ఏంజాయ్ చేస్తున్న యంగ్ హీరో......



ఈ మద్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సాంప్రదాయం ఆనవాయితీగా మారింది. ఏంటదీ అని అనుకుంటున్నారా..సినిమా హీరోయిన్స్ గా ఒక రేంజికి వచ్చిన తర్వాత వారి చెల్లెలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఆనవాయితీగా మారింది. గతంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు తన చెల్లెలు అదితి అగర్వాల్‌ని రాఘవేంద్రరావు డైరెక్షన్‌‌లో గంగోత్రి సినిమా ద్వారా పరిచయం చేసింది.

ఇప్పుడు ఆభాద్యతను మళ్శా కొత్తగా వరుణ్ సందేశ్ తీసుకన్నట్లు ఉన్నాడు. దానికి కారణం అక్కలు పెద్ద హీరోల సినిమాలతో బిజీగా ఉంటే, వారి బాటలోనే చిత్రసీమలో ఎగదాలనే ఉద్దేశ్యంతో చూస్తున్న చెల్లెళ్శకు వరుణ్ సందేశ్ దారి చూపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో కాజల్ చెల్లెలు సిషా అగర్వాల్ ని తెలుగు చిత్ర సీమకు ఏమైందీ ఈవేళ అనే చిత్రంలో హీరోయిన్‌‌గా పరిచయం చేయడం జరిగింది.

ఇప్పుడు తమిళంలో చికుబుకు అనే చిత్రంలో నటించినటువంటి ప్రీతి రావుని కూడా ఇక్కడికి తెస్తున్నాడు. తెలుగులో కూడా తనకంటూ అభిమానులను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో తన అక్క అమృతారావు లాగా బాలీవుడ్ లోనే ఉండిపోకుండా దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో శ్రావణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యుకె ఎవేన్యూస్ పతాకంపై పి.ఉదయ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments: