తెలుగు సినీ ప్రపంచంపై సైటరిక్ గా వర్మ రూపొందించిన చిత్రం కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం...అప్పలరాజు. మర్యాదరామన్న అనంతరం సునీల్ చేస్తున్న ఈ చిత్రం మార్కెట్ లో మంచి క్రేజ్ నే కలగచేసింది. కథ ప్రకారం... అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. కానీ ఏ సినిమా నచ్చదు.అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే..
ఇప్పుడున్న దర్శకుల పని తీరుపై అప్పల్రాజుకి సదాభిప్రాయం ఉండదు. తెలుగు సినిమా పరిశ్రమ తలదన్నేలా ఓ సినిమా తీయాలనే సంకల్పంతో 'నాయికి' అనే కథ రాసుకుంటాడు. తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు . ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. ఈ సినీ మాయా ప్రపంచంలో తెలుగురాని సహాయ దర్శకురాలు కృష్ణారెడ్డి (స్వాతి), ఒంటికన్ను గవర్రాజు (కోట), శ్రీశైలం (బ్రహ్మానందం) లాంటి వ్యక్తులు తారసపడతారు. ఇంతకీ అప్పల్రాజు దర్శకత్వం వహించాలనే కల నెరవేరిందా? లేదా? అనే విషయం తెర మీదే చూడాలి.చిత్రంలో 'ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు..' వంటి పాటలన్నీ ఆకట్టుకొంటాయి. దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఓ పాట రాయడం విశేషం.
సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్
నటీనటులు: సునీల్, స్వాతి, సాక్షి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణుమాధవ్, తనికెళ్ల భరణి, అలీ, అజయ్, కోవై సరళ, ఎమ్మెస్ నారాయణ, కృష్ణుడు, రఘుబాబు తదితరులు.
నిర్మాత: కిరణ్‌కుమార్ కోనేరు
దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ

No comments:
Post a Comment