Wednesday, February 23, 2011

"యల్.బి.డబ్ల్యూ" లైఫ్ బిఫోర్ - నేటి మానవ సంబంధాలికి నిజమాయిన ప్రతిరూపం ఈ సినిమా. LBW Movie Review





STORY:

అమెరికాలో రాజేష్, రాధికలు ఒకే ఆఫీసులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తుంటారు.వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. రాజేష్‍ ని రాధిక ప్రేమిస్తుంది.కానీ రాజేష్‍ ఆమేను ఆ దృష్టిలో చూడలేదంటాడు.కానీ రాజేష్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోటానికి వీళ్ళిద్దరికి మధ్య వచ్చిన మరో స్నేహితుడు రాధికను మళ్ళీ మామూలు మనిషిని చేసి ఆమె అభిమానాన్ని సంపాదించి ఆమెతో ప్రేమలో పడతాడు.ఇది గమనించిన రాజేష్ కి అప్పుడు తాను రాధికను ప్రేమిస్తున్న సంగతి తెలుస్తుంది.కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది.

ఇదిలా ఉంటే మన హైదరాబాద్ లో ఉండే ముగ్గురు స్నేహితులు యల్ కె జి నుండి క్లాస్ మేట్స్.వాళ్ళల్లో ఒకతను అను అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.కానీ జీవితం పట్ల, చదువుపట్ల అతనికున్న నిర్లక్ష్యం వల్ల, అతని దురభ్యాసాల వల్ల అను అతనికి దూరమవుతుంది.ఈ ముగ్గురు స్నేహితుల్లో జై అనే కుర్రాడు అనూకి దగ్గరవుతాడు.అతనికి అమెరికాలో ఐ బి యమ్ లో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలోని పని  వత్తిడి వల్ల అనూతో అతను సరిగ్గా మాట్లాడలేకపోతూంటాడు.


Analysis:

ఈలోగా అనూకి ఆమె తండ్రి అమెరికాలోని రాజేష్ తో పెళ్ళి సెటిల్ చేస్తాడు. అది తెలుసుకున్న జై వెంటనే ఉద్యోగం వదులుకుని ఇండియాకి వస్తాడు. కానీ అప్పటికే అంతా ఆలస్యం అవుతుంది.జై లాగే రాజేష్ కూడా రాధికతో పెళ్ళిపీటల మీదకు వెళ్ళే వరకూ ఫోనే చేసి తనను పెళ్ళి చేసుకోమని అడుగుతూ ఉంటాడు.ఆ తర్వాత ఏం జరిగిందనేది వెండి తెరమీద చూడాల్సిందే.

నలుగురు కుర్రాళ్ళు, ఇద్దరమ్మాయిలూ కలసి సరదాగా తమ స్నేహితుడి ప్రేమ గురించీ, అతని పెళ్ళి గురించీ తమలో తాము మాట్లాడుకుంటూంటారు.వారి చర్చలో అమెరికాలోని రాజేష్‍ రాధికల కథ, హైదరాబాద్ లోని అను, జై ల కథ వస్తాయి.ఈ రెండు కథలనూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కని స్క్రీన్ ప్లేతో చూపించాడు దర్శకుడు.అతనికిది తొలి చిత్రమని జనం నమ్మలేనంత చక్కగా ఈ చిత్రాన్ని తీశాడు దర్శకుడు సత్తారు. అతని టేకింగ్ స్టైల్ గానీ, నటీనటులతో పనిచేయించుకున్న తీరు గానీ ముచ్చటగా ఉంటుందీ చిత్రంలో.

ఇక్కడ మరో విశేషమేమిటంటే ఇందులోని నటీనటులూ,సాంకేతిక నిపుణులూ దాదాపు అందరూ కొత్తవారే. అయినా అందరూ చాలా బాగా నటించారు.ముఖ్యంగా రాధిక, రాజేష్, అతని స్నేహితుడు, అను, జై, అనుని ప్రేమించి దురభ్యాసాలకు అలవాటు పడిన కుర్రాడు ఇలా అందరూ చక్కగా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.ఈ సినిమా రొటీన్ కు భిన్నంగా ఉంటుంది.ఇందులో పిచ్చి గంతులూ, రెండర్థాల పిచ్చి పాటలూ, కొడితే మనుషులు గాల్లోకి ఎగిరేలాంటి అసహజమైన పిచ్చి ఫైటులూ లేవు.పైగా పాటలు అర్థవంతంగా, సందర్భోచితంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తాయి.
సంగీతం - చాలా బాగుంది.సింపుల్ గా వినసొంపుగా ఉంది.పాటలు అన్నీ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది.
కేమెరా - చాలా బాగుంది.చూట్టానికి చక్కగా కళ్ళకు హాయిగా ఉందీ చిత్రంలోని కేమెరా వర్క్.
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - నీట్ గా ఉంది.
మాటలు - సహజంగా ఉన్నాయి.
పాటలు - ఇవి కూడా అలాగే ఉన్నాయి.
కొరియోగ్రఫీ - ఇలాంటి సినిమాలకు కొరియోగ్రఫీ అక్కరలేదేమో.
యాక్షన్ - ఒకే ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉందీ చిత్రంలో. అది కూడా చాలా సహజంగా ఉంది.

No comments: