Tuesday, March 1, 2011

ముదుసలి సల్మాన్‌తోనా...? కుర్రాడ్ని చూస్కోండి.. వస్తా!! సల్మాన్ ఖాన్ సల్లగా జేల్లకాయి తినిపించిన ప్రియమణి



ముక్కుకు సూటిగా మాట్లాడేవారు సినీ పరిశ్రమలో చాలా తక్కువగానే ఉంటారు. ఎందుకంటే అలా మాట్లాడితే ఆఫర్లు ఎడారి ఒయాసిస్సులా మారిపోతాయ్. కానీ అవార్డుల క్వీన్ ప్రియమణి ముక్కుకు సూటిగానే కాదు ముక్కు బద్ధలయ్యేటట్లు మాట్లాడేవారిలో ఒకర్తె.

ప్రియమణి నటనను చూసి ముచ్చటపడ్డ ఓ బాలీవుడ్ నిర్మాత ఆమెతో ఓ సిన్మా చేయాలని ఇటీవల సంప్రదించాడట. కథంతా విన్న తర్వాత ఇంతకీ హీరో ఎవరూ అని ప్రశ్నించిందట ప్రియమణి. దాంతో అతను సల్మాన్ ఖాన్ అని చెప్పడంతో... ముదుసలి సల్మాన్‌ఖాన్‌తోనా...? నా ఏజ్‌కు తగ్గట్లుగా నాతో సరిజోడీగా ఉండే కుర్ర హీరోను చూస్కోండి. అప్పుడు ఆలోచిస్తా అని అతడి ముఖం మీదే చెప్పేసిందట ప్రియ.

ప్రియమణి దృష్టిలో సల్మాన్, అమీర్ వంటి బాలీవుడ్ హీరోలందరూ ముసలాళ్ల కిందే లెఖ్ఖన్నమాట. మరి టాలీవుడ్ జగపతి బాబు కుర్రాడేనా ప్రియమణీ అని అడిగితే ఏం సమాధానం చెపుతుందో..? ఈసారి అడుగుదాం...

No comments: