Tuesday, March 1, 2011

ట్విట్టర్‌లో బొమ్మ పెట్టి అభిమానుల చేత బండ భూతులు తిట్టించుకున్న హీరోయిన్.


బాలీవుడ్ తారలు ఏదో ఒక సంచలనానికి తెరతీస్తూనే ఉంటారు. ఇటీవల టాప్‌లెస్ ఫోజులో కనబడి రెచ్చగొట్టిన బిపాసా బసు తాజాగా తన బూటు లేసులను చిన్నపిల్లలతో కట్టించుకున్నట్లుండే ఫోటోను ట్విట్టర్ పేజీలో పెట్టింది.

ఫోటో పెట్టడమే కాకుండా లేసులు కట్టుకునేందుకు తనకసలు టైమే ఉండదని బడాయి కోతలూ కోసింది. ఆ ఫోటో అలా లైన్లోకి వచ్చిందో లేదో జనం బిపాసాను బండబూతులు తిడుతూ ట్విట్టర్‌లో లేఖాస్త్రాలు సంధించారట. దాంతో జడుసుకున్న బిపాస వెంటనే ఆ ఫోటోను అక్కడి నుంచి తొలగించేసిందట.

తొలగించడమే కాకుండా ఆ ఫోటోలో ఉన్నది తాను కాదనీ, తన చెల్లెలికి స్నేహితురాలంటూ తప్పించుకున్నదట. ఏమైనప్పటికీ ఆ ఫోటోను తీసేవేసేటట్లు సహాయపడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నదట.


తారలు ఇలా చెప్పడం మామూలే కదా.. నగ్నంగా ఫోజులిస్తూ ఆ ఫోజుల్లో ఉన్నది తను కాదని ఎంతమంది చెప్పలేదూ...?

1 comment:

Ravi Vennavalli said...

News bavunne kani. Nalanti users mobile nundi browse chestuntaru kada mari. Maku anuvga settings marcgandi. Theame load avvadaniki chala time padutundi. Already blogger lo a saukaryam undi gamanim chundi.