మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బ్లస్టర్ మూవీ "అత్తకు
యముడు అమ్మాయికి మొగుడు" చిత్రం సీక్వెల్‌ను రామ్ చరణ్ తేజతో చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాలీవుడ్ న్యూస్. ఈ చిత్రంలో రామ్ చరణ్ అత్త పాత్రలో శ్రీదేవి నటిస్తుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
మరో విశేషం ఏంటంటే.. ఇదే చిత్రం ద్వారా శ్రీదేవి కుమార్తె జాహ్నవిని కథానాయికగా పరిచయం చేస్తారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. శ్రీదేవి మాత్రం తమ కుమార్తె ఇంకా చిన్నపిల్లేననీ, హీరోయిన్‌గా నటించే వయసుకు ఆమె ఇంకా చేరుకోలేదని చెపుతోంది.
ఇదిలావుంటే.. అసలు శ్రీదేవి-జాహ్నవిలు సినిమాల్లో నటిస్తారంటూ వస్తున్న వార్తలపై శ్రీదేవి భర్త బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తమకు అటువంటి ఉద్దేశ్యాలే లేవనీ, అయినా ఏవేవో వార్తలు రాసి పారేస్తున్నారంటూ మండిపడ్డారు.
No comments:
Post a Comment