Wednesday, March 23, 2011

రాంగోపాల్ వర్మ నెక్ట్స్ పిక్చర్ "రెడ్డిగారు పోయారు"









క్రియేటివ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ సినీ ఇండస్ట్రీలో ఉంటే అక్కడే అందరి లుక్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన తీయబోయే సినిమా టైటిల్ దగ్గర్నుంచే పబ్లిసిటీ మొదలవుతుంది. సినిమా హిట్టా.. ఫట్టా అనే సంగతి పక్కన పెడితే రాము కొత్త సినిమా కోసం వేసే స్టెప్స్ ఖచ్చితంగా అందరినీ తనవైపు తిప్పుకునేలా చేస్తాయి.

తాజాగా ఆయన మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అప్పల్రాజుకు అంతసీను లేదులే అని అనుకునేలోపు ఐదు రోజుల సినిమా దొంగలముఠా తీశారు. అది ఢామ్మని పేలిపోయి ఇంతేనా అనుకునేలోపే... మరోసారి "రెడ్డిగారు పోయారు" అనే టైటిల్‌తో ముందుకొస్తూ "దొంగల ముఠా"ను పక్కన పెట్టి దీనిగురుంచే ఆలోచించేట్లు చేశారు.

ఇంతకీ "రెడ్డిగారు పోయారు" అనే టైటిల్ నాయకుడికి సంబంధించిందా... లేదంటే ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి గురించా అని అడిగితే ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు వర్మ. అయితే రెడ్డిగారు పోయారు చిత్రంలో సమకాలీన రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టేటట్లు చూపిస్తానని చెపుతున్నారు. కనుక ఈ సినిమా ఖచ్చితంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినదే అయివుంటుందని టాలీవుడ్ ఫిలిం జనం భావిస్తున్నారు. మరి వర్మ "అయితే ఓకే అంటారా....?

No comments: