చార్మి నటించిన వరస సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని ఆమె ఒప్పుకోవటం లేదు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ....నాకు లేని బెంగ మీకుకెందుకో అర్థం కాదు. నటిగా ఎప్పటికప్పుడు నిరూపించుకొంటూనే ఉన్నాను. ప్రతిభకు హిట్..ఫ్లాపులతో సంభందం లేదు...ఎంత టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు వెలుగులోకి రాకపోవచ్చు. దానికి చాలా కారణాలుంటాయి. ఎవరినీ నిందించలేం అంది చార్మి. ఆమె తాజాగా వర్మ దర్శకత్వంలో తయారై రిలీజైన దొంగలముఠా చిత్రం లో నటించింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే అంతుకు ముందు ఆమె చేసిన మంగళ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.దాంతో ఆమె ఫ్లాప్ అనే పదం వింటే మండిపడుతోంది. ఈ విషయమే మాట్లాడుతూ... అంతెందుకు అమీర్‌ఖాన్‌నే తీసుకోండి. ఓ సందర్భంలో అమీర్ పనైపోయింది అన్నారు. ఏమైంది? ఇప్పుడు బాలీవుడ్‌కి కొత్త పాఠాలు చెబుతున్నాడు. చార్మి వల్ల ఓ సినిమా బాగా ఆడలేదు అనుకొన్నప్పుడే నేను నటిగా ఫెయిల్ అయినట్టు. అలాంటి ప్రమాదం ఇంత వరకూ ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తులో రాదు కూడా రాదు అంటుంది. అలాగే సచిన్ టెండూల్కర్ ఓ మ్యాచ్‌లో డకౌట్ అయినంత మాత్రాన అతనికున్న విలువ తగ్గిపోతుందా? లేదు కదా. అలాగే కొన్ని పరాజయాలు వచ్చినంత మాత్రాన ఎవర్నీ తేలిగ్గా తీసుకోకూడదు అని చెప్తోంది చార్మి.
English summary
Ram Gopal Varma’s latest film ‘Dongala Muta’ starring Ravi Teja
and Charmi
in the lead roles had been released yesterday. Though the film
has got mixed reviews, RGV announced that the film is a super hit.



No comments:
Post a Comment