Friday, March 4, 2011

నడి వయసు రజనీకాంత్‌కు జోడీగా బాలీవుడ్ సిల్క్‌స్మిత


"

ది డర్టీ పిక్చర్" చిత్రంలో సిల్క్ స్మిత అవతారమెత్తిన ప్రౌఢ సుందరి విద్యా బాలన్‌ను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొన్న ఎమ్‌ఎఫ్ హుస్సేన్ విద్యాబాలన్ నగ్న చిత్రాన్ని చిత్రీకరిస్తానని పెద్ద ఆఫర్‌నే ఆమె ముందుంచాడు. ఇపుడేమో ఏకంగా సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన నటింపజేయడానికి ఆమె కాల్షీట్లకోసం దర్శకుడు కేఎస్ రవికుమార్ ఎదురు చూస్తున్నారు.

రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న రాణా చిత్రంలో రజినీ మూడు పాత్రల్లో కనిపిస్తారు. కుర్ర రజినీ, మధ్యవయస్కుడైన రజినీకాంత్, వృద్ధుని పాత్రలోనూ కనిపించనున్నారు. యువ రజినీ సరసన దీపికా పదుకునే నటిస్తుంటే ముదుసలి రజినీ ప్రక్కన బాలీవుడ్ సీనియర్ నటి రేఖ నటించనుంది.

ఇక మధ్యవయస్కుడైన రజనీ సరసన తొలుత అనుష్క లేదా అసిన్ లేదా కత్రినాను నటింపజేయాలనుకున్నారట. కానీ విద్యాబాలన్ అయితే సరిగ్గా సరిపోతుందని దర్శకుడు నిర్ణయానికి రావడంతో ఆ ఛాన్స్ బాలన్‌కు దక్కిందని చెపుతున్నారు.

No comments: