Wednesday, March 16, 2011

ఆ వెబ్‌సైట్లు నా రెమ్యునరేషన్ రెండు కోట్లంటున్నాయి.. నిజమా...?!







ఇటీవలే విడుదలై ప్రేక్షకుల సక్సెస్‌తో హిట్‌ దర్శకురాలిగా మారిన 'అలామొదలైంది' దర్శకురాలు నందినీరెడ్డి వెబ్‌సైట్స్‌పై సెటైర్లు వేసింది. చిత్ర విజయం ప్రేక్షకులు తమ కృషికి ఇచ్చిన తీర్పుగా పేర్కొంది. ఇటీవలే కొన్ని వెబ్‌సైట్లు.. నందినీరెడ్డి రెండు కోట్లు డిమాండ్‌ చేస్తుందనే వార్తల్ని రాశాయి.

"నాకు తెలీకుండా నా రేటు అలా ఫిక్స్‌చేశారా!" అంటూ నవ్వుకుంది. ఒకవేళ రెండు కోట్లని వారంటే ఆ పుణ్యం మీరే కట్టుకోండి.. అంటూ సూచించింది. 'అలామొదలైంది' నా కెరీర్‌ను నిలబెట్టింది. రంజిత్‌ మూవీస్‌ను మర్చిపోలేను. ఈ చిత్ర కథ చెప్పినప్పుడు కొంతమంది అర్థంకాలేదన్నారు.

దాము అనే నిర్మాతకు అర్థమై నాపై నమ్మకంతో సినిమా తీసి సక్సెస్‌ సాధించారు. నా కేరాఫ్‌ అడ్రస్‌ రంజిత్‌ ఆఫీసే.. అని చెపుతోంది. సహజంగా సినిమా పూర్తయ్యాక దర్శక నిర్మాతల్లో తేడాలు వస్తాయి. కానీ మా మధ్య అటువంటివి లేవు. ఇటీవలే ఓ నిర్మాత నన్ను కలవడానికి వస్తానంటే.. రంజిత్‌ కార్యాలయానికి రమ్మన్నాను. ఆయనే చూసి ఆశ్చర్యపోయి... ఇంతలా మంచి మనసుతో దర్శక నిర్మాతలు రిలీజ్‌ అయి కూడా ఉన్నారంటే... హ్యాట్సాప్‌ అన్నారని చెప్పింది.

"అన్నట్లు... అలామొదలైంది.. 50రోజుల వేడుక ఈనెల 15న గ్రాండ్‌గా శిల్పకళావేదికలో జరుగుతోంది. ప్లీజ్‌.. మీరూ రండే..." అని పిలుస్తోంది నందినీ రెడ్డి

No comments: