అన్ని పార్టీలు ఛీ కొట్టడంతో ఏం చేయాలో తోచలేదో ఏమోగానీ రాజశేఖర్ - జీవిత దంపతులు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మొన్నటి వరకూ వీరుడూ సూరుడూ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన ఈ జంట ఈసారి రివర్స్ గేర్ వేసింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాము అనుకున్నంత ఉదాత్తుడేమీ కాదనీ, కేవలం ముఖ్యమంత్రి పదవికోసమే ఆరాటపడుతున్నారని చెప్పుకొచ్చారు. నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ... తొలుత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓహో అనుకున్నాననీ అన్నాడు. ఆయన హైటెక్ ముఖ్యమంత్రి అని పొంగిపోయామంటూ మీసాలను పైకి మెలివేశాడు.
ఆ తర్వాత చటుక్కున మధ్యలో టాపిక్ తిప్పుతూ... వైఎస్సార్ డాక్టర్.. నేను డాక్టర్... అందుకే వైఎస్సార్‌కు దగ్గరయ్యా. అప్పట్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు డాక్టర్ గా వైఎస్సార్ పరిచయం. ఆ తర్వాత పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి చంద్రబాబు నాయుడిని కోలుకోలేని దెబ్బ తీశారు. చంద్రబాబు మాటలు చెపితే... వైఎస్సార్ చేతల ద్వారా తన పనేమిటో చూపించారని పొగడ్తల వర్షం కురిపించారు.
2009 ఎన్నికల సమయంలో చిరంజీవి పార్టీ పెడితే... ఆ అభ్యర్థులను ఓడించేందుకు తమను ఎన్నికల పర్యటన నిర్వహించాలని వైఎస్సార్ కోరారన్నారు. ఆయన కోరిక మేరకు మొత్తం 24 నియోజకవర్గాల పరిధిలో తాము పర్యటించామనీ, ఒక్క అభ్యర్థి తప్ప మిగతా 23 చోట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారన్నారు. అయితే దురదృష్టవశాత్తూ వైఎస్సార్ దూరమవడంతో పరిస్థితి మారిపోయిందన్నారు.
వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యేలంతా మద్దతుగా నిలిచారంటే నిజమేనని నమ్మేశానన్నారు. అయితే అది నిజం కాదని ఆలస్యంగా తెలుసుకున్నాననీ, జగన్ పై విమర్శలకు దిగారు. విజయవాడ లక్ష్యదీక్ష సమయంలో తాము సభకు వెళితే, అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. దాన్ని చూసో.. మరెందుకో కానీ ఢిల్లీ సభకు తాము వస్తామని చెపితే రావద్దన్నట్లు సంకేతాలు పంపించారని జీవిత ఆరోపించారు.
నిజానికి వైఎస్ మనస్తత్వం జగన్ కు వచ్చి ఉంటుందని అనుకున్నామనీ, కానీ వైఎస్సార్ మనస్తత్వానికి జగన్ మనస్తత్వానికి పోలికే లేదని మరోసారి మీసం మెలేస్తూ చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద ఏ పార్టీలోకి జంప్ జిలానీలుగా వెళదామన్నా ఎవరు ఈ దంపతులను పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో రాజశేఖర్ మీడియాలో మీసాలు తిప్పుతూ పిచ్చి చేష్టలు చేస్తున్నట్లు కనిపించారు.

No comments:
Post a Comment