Monday, May 2, 2011

మొన్న "శక్తి" ఢమాల్.. నేడు "రాక్షసి" ధడేల్.. ఇలియానా గుభేల్!!





సెక్సీ ఒంపుల ముద్దుగుమ్మ ఇలియానా కెరీర్ ఢమాల్ మన్నట్లే అంటున్నారు టాలీవుడ్ సినీజనం. ఆమధ్య జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శక్తి సినిమాలో గ్లామర్ అందాలను ఒలకబోసినప్పటికీ కథలో పస లేకపోవడంతో చిత్రం బాక్సాఫీసు వద్ద మోకాళ్లు చీరుకుపోతూ బోర్లా పడింది.

అంతే..!! ఇలియానాకు తన కెరీర్ ఏమవుతుందోనన్న బెంగ పట్టుకుంది. అయితే సన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన "నేనూ నా రాక్షసి" చిత్రం ద్వారా తన ఫేట్ మారుతుందని గట్టి నమ్మకం పెట్టుకుంది.

అటు పూరీతో ఇటు రానాతో గంటలు గంటలు డిస్కషన్స్ కూడా చేసినట్లు భోగట్టా. చిత్రం ఎలాగైనా సూపర్ హిట్ కావాలని తెగ శ్రమించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత టాక్ చూసి షాక్ తిన్నదట.

గ్లామర్ ప్రదర్శనతో ఊపేసే ఇలియానా నటించిన చిత్రాలు వరుసగా విఫలమవుతుండటంతో ఆమెవైపు దర్శకనిర్మాతలు అనుమానంగా చూస్తున్నారట. మరోవైపు టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇలియానాకు ఇక అంత రేటు పలకదని ఫిలిం జనం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అయినా ఇలియానా తనకున్న ఎసెట్స్‌తో తిరిగి ఓ ఊపు ఊపగలదు. కానీ ఆ ఛాన్స్ ఇచ్చే దర్శకనిర్మాతలు దొరకకాలిగా...?!!

No comments: