Thursday, May 26, 2011

ఛార్మి ఛీ కొట్టిందట.. అందుకే ఆండ్రియాతో వెళ్లిపోయాడట




ఇండస్ట్రీలో ఇవాళ కలిసి ఉన్న జంట మరికొంతకాలానికి మరొకరితో జత కట్టేస్తుంటారు. మోడ్రెన్ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ వ్యవహారం కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఆ మధ్య ఛార్మితో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడన్న వార్తలతోపాటు ఏకంగా ఆమెతో కలిసి నటించనున్నట్లు టాలీవుడ్ కోడై కూసింది. అయితే ఆ తర్వాత తను ఛార్మితో చేయడంలేదని దేవీశ్రీ స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సివచ్చింది.

ఇదిలావుంటే దేవీశ్రీ ప్రస్తుతం చెన్నైలోనే ఎక్కువగా తిష్ట వేసి ఉంటున్నాడట. దీని వెనక కారణం ఏంటయా..? అని ఓ పిల్లజర్నలిస్టు ఆరాతీస్తే అసలు సంగతి బయట పడిందట.

దేవీశ్రీ ఇటీవలే ఓ వేడుకలో పాల్గొన్నాడట. అక్కడ నటి ఆండ్రియాతో కలిసి చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ డాన్స్‌ కూడా చేశాడట. అలా అలా బాగా పొద్దుపోయాక ఇద్దరూ కలిసి ఎంచక్కా కారెక్కి వెళ్లిపోయారట. ఇది చూసిన కొంతమంది టాలీవుడ్ జనం... మరి చార్మి ఛీ కొడితే ఏం చేస్తాడు ఆండ్రియాతో వెళ్లక.. అంటూ గొణిగారట.

No comments: