Monday, May 23, 2011

నా బంగారాన్ని ఎలా చూపిస్తా: శరణ్య మోహన్

భీమిలి కబడ్డీ జట్టు, విలేజ్ వినాయకుడు వంటి చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ శరణ్య మోహన్. ఈ అమ్మడు తన అందాలను వెండితెరపై ఆరబోసేందుకు ససేమీరా అంటోంది. మేకప్ భామలు సైతం ఎక్స్‌పోజింగ్ ఉన్న పాత్రలకే మొగ్గు చూపున్న తరుణంలో శరణ్య మోహన్ మాత్రం తద్విరుద్ధంగా స్టేట్‌మెంట్లు ఇవ్వడం గమనార్హం.

ఆమె నటించిన రెండు చిత్రాలు అంతంత మాత్రంగా ఆడినప్పటికీ.. తన అందాలను ఆరబోసేందుకు మాత్రం నిరాకరిస్తోంది. ఆఫర్లు వచ్చినా.. రాకపోయినా.. ఫర్వాలేదని తన బంగారం లాంటి చిట్టి అందాలను మాత్రం చూపించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

కేవలం అందాలను చూపిస్తేనే ఆఫర్లు ఇస్తామని ఎవరైనా ముందుకు వస్తే అలాంటి వారిని కలుసుకునేందుకు సైతం ఇష్టపడననంది. అలాంటి ఆఫర్లు లేకపోయినా ఫర్వాలేదని, ఖాళీగా కూర్చొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. వెండితెర అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్ చేయాల్సిన అవసరం లేదని, మంచి నటన, ప్రతిభ ఉంటే చాలని అంటోంది ఈ ముద్దుగుమ్మ.

No comments: