ప్రముఖ ఛాయాగ్రాహకుడు కెవి ఆనంద్ దర్శకుడుగా మారి రూపొందించిన కో అనే తమిళ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయింది.దాన్నే తెలుగులో రంగం పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేసారు.అయితే సినిమా ఇక్కడ జనాలకి పట్టలేదు.హీరో పెద్ద మైనస్ అయితే టైటిల్ అస్సలు ఎవరిని ఎట్రాక్ట్ చేయలేకపోయింది.అయితే ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ మాత్రం కోటి రూపాయల వరకూ పలికాయని లేటెస్ట్ వార్త. ఓ లీడింగ్ నిర్మాణ సంస్ధ వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న తమ వారసుడుకి హిట్టవ్వటానకి ఈ చిత్రం కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
హీరోయిజం లేని ఈ చిత్రం కేవలం కధా బలం,క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టే సినిమాకు హైలెట్ గా నిలిచి సినిమాని నిలబెట్టింది.అందులోనూ ఇప్పుడు హిందిలో సౌత్ నుంచి వచ్చిన సినిమాలను కొనుగోలు చేసి రీమేక్ చేయటం ఫ్యాషన్ గా మారింది.రీసెంట్ సల్మాన్ ఖాన్ రెడీ చిత్రం తెలుగు రెడీకి రీమేక్.అలాగే మళయాళంలో సూపర్ హిట్టయిన బాడీగార్డు చిత్రాన్ని సైతం హిందీలో రీమేక్ చేస్తున్నారు.అలాగే తెలుగు చిత్రం విక్రమార్కుడు కూడా హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు
No comments:
Post a Comment