గడిచిన వారం ‘దుశ్శాసన’,‘వైశాలి’ చిత్రాలు రిలీజు అయ్యాయి.మొదటిది స్ట్రైయిట్ చిత్రం కాగా,రెండోది డబ్బింగ్ వ్యవహారం.వాటిల్లో పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో శ్రీకాంత్, సంజన జంటగా నటించిన ‘దుశ్శాసన’చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ రోజే మార్నింగ్ షో కి డిస్ట్రిబ్యూటర్స్ సమస్య వచ్చి సినిమా విడుదల కాలేదు.మాట్ని నుంచికొన్నిచోట్ల,మరుసటి రోజు నుంచి మరికొన్ని చోట్ల విడుదలైన ఈ చిత్రం ఓపినింగ్స్ మాత్రం ఫరవాలేదనిపించుకుంది.పోసాని,శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన తరహాలో ఎక్సపెక్ట్ చేసి జనం వచ్చారు. అయితే సినిమా మెంటల్ కృష్ణ తరహాలో అర్దం పర్ధం లేకుండా కొనసాగి జనాలకు మెంటలెత్తించేసింది.
దాంతో విడుదల అయిన మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఆ తర్వాత టీవీ ఛానెల్స్ లో కృష్ణవంశీ ఎంత మొత్తుకున్నా లెక్క చేసేవారు కరవయ్యారు.ఇక ‘వైశాలి’ విషయానికి వస్తే చందమామలో హీరోయిన్ గా చేసిన సింధుమీనన్ తమిళంలో నటించిన చిత్రాన్ని దిల్ రాజు డబ్బింగ్ చేసి స్టైయిట్ చిత్రంలా పబ్లిసిటీ చేసి విడుదల చేసారు.ప్రముఖ దర్సకుడు శంకర్ శిష్యుడు ఆరివళగన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటం పబ్లిసిటీ పరంగా ప్లస్ అయింది.అయితే ఏదో లవ్ స్టోరీలా ఈ చిత్రాన్ని పబ్లిసిటీ చేస్తూండటంతో అదే ఊహతో ధియోటర్ లోపలకి వెళ్ళిన వారికి అదో హర్రర్ సినిమా అని అర్దమై షాక్ అవుతున్నారు.
అదే నెగిటివ్ టాక్ గా పరిగమిస్తోంది.దాంతో దిల్ రాజు తమను మోసం చేసాడని జనం ఫీలవుతున్నారు.ఆయన బ్యానర్ పై విడుదల కావటంతో ఆ ఎక్సపెక్టేషన్ తో వెళ్ళినవారు తిట్టుకుంటున్నారు. అంతేగాక సెకెండాఫ్ కూడా సినిమాకు మైనస్ అయి మహా నసగా ప్రేశ్రకులకు సహన పరీక్ష పెట్టింది.ఇక అంతకుముందు వారం నిజుదల అయిన రవితేజ ‘వీర’పరిస్దితి చెప్పుకోలేనంతగా డ్రాప్ అయిపోయింది.ఇప్పటికీ ప్రభాస్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, నాగచైతన్య ‘100%లవ్’ స్టడీగా సాగుతున్నాయి
No comments:
Post a Comment