వెర్రి వేయివిధాలని మన పెద్దవాళ్లు ఊరకే అనలేదు. ఇది నిజం చేసేలా విదేశీయులు తాజాగా నడుచుకున్నారు. ఓ ప్రపంచ రికార్డు కోసం బట్టలూడదీసుకున్నారు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా నాలుగు వందల మంది స్త్రీ పురుషులు. వీరంతా.. భార్యాభర్తలు, ప్రేమికులు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ముక్కు మొహం తెలియని వివిధ దేశాలకు చెందిన స్త్రీ పురుషులు. వీరందరూ కలిసి రికార్డు కోసం నగ్నగా సముద్ర స్నానాలు చేశారు.
సాధారణంగా మనం సామూహిక వివాహలు అనే మాటను విన్నాం. కానీ సామూహిక నగ్న స్నానాలు అనే మాటను వినడం ఇదే తొలిసారి అయివుండొచ్చు. "వరల్డ్ స్కిన్నీ డిప్పింగ్" కోసం వివిధ దేశాలకు చెందిన 400 మంది స్త్రీ పురుషులు సౌత్ వేల్స్లోని గౌవెర్ రోస్సీలీ బీచ్లో సామూహిక నగ్న స్నానాలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పారు.
గతంలో 250 స్త్రీ, పురుషులు ఈ రీతిలో స్నానం చేసిన ఒక రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డును బద్ధలు కొట్టేందుకుగాను వీరంతా బట్టలు విప్పేసి చలచల్లని సముద్రపు నీటిలో స్నానం చేసి అందరినీ ఆశ్చర్యానికి లోను చేశారు. ఎంతైనా... మానం, మర్యాదల కంటే రికార్డులే ముఖ్యమని విదేశీయులు మరోమారు నిరూపించారు
No comments:
Post a Comment