Thursday, June 23, 2011

ఇలియానా, అనూష్క, తమన్నా, కాజల్, హన్సిక రెమ్యునేషన్స్ వరసగా....









తెలుగులో టాప్ రెమ్యునేషన్ తీసుకునే హీరోయిన్ గా ఇలియానానే ఇప్పటికీ టాప్ పొజీషన్ లో ఉందని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. ఆమె రెమ్యునేషన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లోనూ ఆమెకు 1.25 కోట్లు తీసుకుంటున్నారని రాసింది. అలాగే బాలీవుడ్ లో సైతం ఆమెకు ఇదే పారితోషికం లభిస్తుందని ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.

ఇక అరుంధతి, వేదం చిత్రాలతో స్టార్ స్ధాయికి ఎదిగిన అనూష్క కోటి రూపాయలు రెమ్యునేషన్ తెలుగు,తమిళంలో తీసుకుంటూ సెకెండ్ ప్లేసులో ఉంది. ఇక వీరి తర్వాత స్ధానం తమన్నా ఆక్రమించింది. తమిళంలో సన్ టీవీ అధినేతలు మారన్ ద్వయం తీసే ప్రతిసినిమాలోనూ.. ప్రముఖ పాత్ర పోషించిన తమన్నాకు 70 నుంచి 80 లక్షలు పారితోషికం ఇవ్వాలి.

ఇక తెలుగులో వరస హిట్స్ తో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ కు చెన్నై, హైదరాబాద్, ముంబైల్లో మంచి డిమాండ్ ఉంది. ఆమె తాజా సినిమా మిస్టర్ పర్ ఫెక్ట్ హిట్ అయ్యాక.. ఆమె పారితోషిక రేటు పెంచేసింది. అయితే పైన చెప్పిన నటీమణుల రేంజుకు ఇంకా కాజల్ రాలేదు. ఆమె నలభై నుంచి యాభై లక్షలు దాకానే రెమ్యునేషన్ తీసుకుంటోంది. అందులోనూ బద్రీనాధ్, 100% లవ్ చిత్రాలకు అల్లు అరవింద్ బాగా తక్కువ ఇచ్చారు.

ఇక దేశముదురు హన్సిక 30 లక్షలు చార్జ్ చేస్తోంది. వీరి తర్వాత స్ధానం జెనీలియాది.తెలుగులో ఆరెంజ్ ప్లాప్ తో ఆమెకు డిమాండ్ తగ్గిపోయింది. రానా తో నా ఇష్టం, నాగ చైతన్య సరనసన బెజవాడ రౌడీలు చిత్రాల్లో ఆమె చాలా తక్కువరేటుకు అంటే పాతిక లక్షలకే చేస్తున్నట్లు వినికిడి.అయితే హిందిలో మాత్రం ఆమె పారితోషికం కోటి రూపాయల వరకు ఉంది.అయితే అక్కడ ఆమెకు సినిమాలులేవు

No comments: