ఐశ్యర్యారాయ్ త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని సూపర్ స్టార్, అభిషేక్ తండ్రి అయిన అమితాబ్ బచ్చన్ సంబరంగా చెబుతున్నారు. తాను తాతను కాబోతున్నానన్న ఆనందాన్ని ఆయన అందరితో పంచుకుంటున్నారు. ట్విట్టర్ లో అమితాబ్ ఈ విషయాన్ని ప్రకటించి తాను ఎంతో సంతోషంగానే ఉన్నానని ఆయన చెప్పారు. అయితే ఐశ్యర్య రాయ్ ఈ విషయాన్ని వెల్లడించలేదు.
కాని తాత అవుతున్నానన్న ఉత్సాహంలో అమితాబచ్చన్ బయటపెట్టేశారు. ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం మధూర్ బండార్కర్ దర్శకత్వంలో హీరోయిన్ అనే చిత్రం చేస్తోంది. ఇక కొంతకాలం పాటు కొత్త చిత్రాలు ఏమీ ఒప్పుకోదని,ఆల్రెడీ కమిటైనవి పూర్తి చేస్తుందని చెప్తున్నారు. అబిషేక్ బచ్చన్ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ లో ని కొందరు తన సన్నిహితులకు పార్టీ ఇవ్వటానికి సన్నాహాలు చేస్తున్నాడు
No comments:
Post a Comment