Saturday, July 9, 2011
ఐష్.. నువ్వు గర్భవతివన్న సంగతి నాకెందుకు చెప్పలేదు..?
మాజీ ప్రపంచసుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ గర్భవతి అయిన సంగతి బిగ్ బి అమితాబ్ చెప్పేంతవరకూ బయటి ప్రపంచానికి తెలియదు. ఐష్ ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిన తర్వాత చాలామంది ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపారు.
అయితే ఆమెతో "హీరోయిన్" చిత్రాన్ని తీస్తున్న దర్శకుడు మధుర్ బండార్కర్ మాత్రం ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నాడట. ఎన్నో ఏళ్లుగా కష్టపడి రూపొందించుకున్న తన కలల ప్రాజెక్టు హీరోయిన్ తీస్తున్న సమయంలో ఐష్ ప్రగ్నెంట్ కావడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడట.
కనీసం ఐష్ తను గర్భవతినన్న సంగతి తనకు ముందుగా తెలియజేసి ఉంటే మరో హీరోయిన్ను వెతుక్కునేవాడినని తన బ్లాగులో రాసుకున్నాడట. పాపం.. ఐష్ ప్రెగ్నెంట్ బండార్కర్కు ఎంత బాధ తెచ్చి పెట్టింది..?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment