Friday, July 8, 2011
దుమారం రేపుతున్న రామ్ చరణ్- దాసరిల కోల్డ్ వార్..!
చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతవరకు వివాదాలకు దూరంగా వుండేవారు. ఒక మాట మాట్లాడాలంటే ఆచి తూచి మాట్లాడేవారు. అయితే, ఆయన తనయుడు రామ్ చరణ్ మాత్రం ఈమధ్య కాలంలో కాస్త స్పీడుగా ఉంటున్నాడు. ఎవరికైనా సరే రీటార్టులు ఇచ్చేస్తున్నాడు. ఈరోజు తాజాగా ట్విట్టెర్ లో కూడా అలాగే ఆయనిచ్చిన ఓ స్టేట్ మెంట్ టాలీవుడ్ లో సెన్సేషన్ అవుతోంది. సెగ పుట్టిస్తోంది. 'గొప్ప దర్శకులుగా పిలవబడే దర్శకులు ఈరోజు కేవలం వేదికల మీద ప్రసంగాలకు మాత్రమే పరిమితమైపోతున్నారు. నోళ్లు తప్ప వాళ్లు మరేమీ కదపలేకపోవడం విచారకరం' అన్నది రామ్ చరణ్ పోస్ట్.
ఇది ఎవరినుద్దేశించి రాశాడన్నది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. కచ్చితంగా ఇది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును ఉద్దేశించినదే అన్నది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే, ఈమధ్య వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకవిధంగా 'మగదీర'లో తనకు నంది అవార్డు రాకుండా, దానిని దాసరి తన్నుకుపోయారన్న ప్రచారం మొదలైన దగ్గర నుంచీ రామ్ చరణ్, వీలు దొరికినప్పుడల్లా దాసరిపై విరుచుకుపడుతున్నాడు.
హీరోయిన్లు అవార్డు ఫంక్షన్లకు రావాడం లేదు కాబట్టి, వాళ్లకు అవార్డులివ్వద్దంటూ దాసరి ఓ వేడుకలో ఆమధ్య కామెంట్ చేశారు. దానిని రామ్ చరణ్ తనకు సంబంధం లేకపోయినా ఖండించాడు. ఆ తర్వాత దాసరి శిష్యులు రామ్ చరణ్ పై మండిపడ్డారు. దాసరికి సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక అప్పటి నుంచీ వీరిద్దరి మధ్యా కోల్డ్ వార్ నడుస్తోంది. అందుకే, ఇప్పుడు చరణ్ ఇండైరేక్ట్ గా దాసరిని ఇలా విమర్శించాడని అంటున్నారు. పెద్దల ప్రోత్సాహం లేనిదే చరణ్ దాసరితో ఎందుకిలా పెట్టుకుంటాడనీ, కావాలనే దాసరితో కయ్యానికి దింపుతున్నారనీ, దాసరి వర్గం భావిస్తోంది.ఇక, ఇప్పుడిది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. కాస్సేపట్లో దాసరి ప్రియ శిష్యుడు, నిర్మాత నట్టికుమార్ రంగంలోకి దిగచ్చు... టీవీ చానెల్స్ కి ఈరోజు పండగే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment