Tuesday, August 30, 2011

సినిమా నటి జీవిత కథ అని చెప్పి హ! నిర్మాత ముండా ఇలాంటి పోస్టర్ చేస్తుంది....నిర్మాత ఫై హీరోయిన్ మండిపాటు



తన సినిమాను బూతు సినిమాలా ఎక్సపోజ్ చేస్తున్నారంటూ విద్యా బాలన్ నిర్మాత ఏక్తా కపూర్ పై మండిపడుతోంది.సిల్క్ స్మిత్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న డర్టి పిక్చర్ కోసం తీసిన విద్యా బాలన్ స్టిల్స్ ,ట్రైలర్స్ మార్కెట్లో బూతు సినిమాని గుర్తు చేస్తూండటంతో ఆమె కంగారుపడుతోంది.అయితే వాటిని ఏక్తాకపూర్ పట్టించుకునేటట్లు లేదు.రాగిణి ఎమ్.ఎమ్.ఎస్ వంటి చెత్త చిత్రాన్నే సెక్స్ చూపెట్టి మార్కెట్ చేసేసిన తాను ఈ సినిమాతో ఎలాగయినా ఓ రేంజి ఓపినింగ్స్ తెచ్చుకోవాలని భావిస్తోంది.అందుకు తగినట్లుగా ప్రమోషన్ చేస్తోంది.

ఈసందర్బంలో విద్యాబాలన్ మాట్లాడుతూ ''ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడమే నా ముందున్న లక్ష్యం. ఈ సినిమాలో నేను టాప్‌లెస్‌గా కనిపించనున్నాననే వార్తలు మీడియాలో వచ్చాయి. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ మధ్య 'టాప్‌లెస్" అనే పదానికి అర్థాన్ని కూడా మార్చేస్తున్నారు కొందరు. టవల్ అడ్డం పెట్టుకొని, చేతులు అడ్డం పెట్టుకొని కనిపించడం టాప్ లెస్ ఎలా అవుతుంది. గతంలో ఓ మ్యాగజైన్ ఫొటో షూట్‌లో నేను అలాగే కనిపించాను అంది.

ఇప్పుడీ చిత్రంలో రజనీని పోలిన పాత్ర ఉంది. దీనిని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా పోషిస్తున్నారు. రకరకాల హెయిర్ స్టయిల్స్ తో, రజనీ అప్పట్లో ధరించినటువంటి చమ్కీ మెరుపుల దుస్తుల్లో నసీర్ కనిపిస్తాడు. వీరిద్దరి మధ్యన కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో నసీరుద్దీన్ షా..విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు.




No comments: