వరుణ్ సందేశ్ తో విడిపోయిన శ్రద్దాదాస్ కు ఊహించని విధంగా మరో దెబ్బ తగిలింది. ఓకే అవుతాయనుకున్న మరో రెండు ప్రాజెక్టులు సైతం ఆమె చేతినుంచి జారిపోయే పరిస్ధితి కనపడుతోంది. దానికి కారణం ముగ్గురు సినిమా ప్లాప్ అయ్యి దారుణంగా దెబ్బ కొట్టటమేనంటోంది. అసలే కెరీర్లో సరైన హిట్ లేక అల్లాడుతున్న ఆమెకు ఈ సినిమా మళ్ళీ లైఫ్ ఇస్తుందని ఆశ పెట్టుకుంది.అంతేగాక అందులో నటించిన నవదీప్ సైతం ఆమెకు తాను వెనక ఉన్నానని హామీ ఇచ్చాడు.అయితే సినిమా పోవటం, నవదీప్ వెంటనే ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వెళ్ళిపోవటం ఆమెను కలవరపరుస్తున్నాయి.
శ్రద్దాదాస్ తాను ఎంత శ్రద్ద పెట్టి చేసినా సినిమా వర్కవుట్ కావటం లేదని భావిస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి మెయిన్ హీరోయిన్ కావాలనుకున్న తన కోరిక తీరకపోగా ఇప్పుడు వస్తున్న సెకండ్ హీరోయిన్ లాంటి వేషాలకు కూడా ముప్పువచ్చే పరిస్థితి ని ఈ 'ముగ్గురు' తెచ్చిపెట్టింది. మరో ప్రక్క వరుణ్ సందేశ్ హ్యాండ్ ఇవ్వటం కూడా ఆమెను బాధల్లో పడేసింది. తను నటించి సినిమాలు గురించి చెప్పాలంటే వరసగా ప్లాప్ సినిమాల లిస్ట్ చదివినట్లు అవుతోందని ఆమె వాపోతోంది. 'టార్గెట్' మొదలుకుని 'అధినేత' వంటి అనేక చిత్రాల్లో ఆమె నటించింది. 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం', 'ఆర్య 2', వంటి చిత్రాలు మాత్రమే ఆమెకు గుర్తింపునిచ్చాయి కానీ ఆమెను మెయిన్ స్ట్రీమ్ లో నిలబెట్టలేకపోయా
No comments:
Post a Comment