Thursday, September 15, 2011

నిఖిత విషయంలో ఖుష్బూ సంచలన వ్యాఖ్య....





గతంలో వివాహానికి ముందు సురక్షితమైన రీతిన శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు అని ప్రకటించిన ఖుష్బూ ఇప్పుడు నిఖిత విషయంలో మరో సంచలనానికి తెర లేపారు. ఒక భార్య, భర్త, ఓ అమ్మాయి మధ్య సాగే సంఘటనలు పూర్తిగా వారి వ్యక్తిగతం. ఆ వ్యవహారంలో తలదూర్చడానికి నిర్మాతలెవరు? ఆల్రెడీ భార్యపట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు దర్శన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవేళ తమను తామే ఓ చట్టంగా కన్నడ నిర్మాతలు భావిస్తే.. అప్పుడు దర్శన్‌ని కూడా శిక్షించాలి కదా?? ఏదేమైనా ఈ విషయంలో దర్శన్ ఎందుకు మౌనం పాటించారో నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఖుష్బూ ప్రకటించారు.నిఖితకు మద్దతు పలికిన ఖుష్బూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కన్నడ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి తన కాపురంలో నిఖిత చిచ్చు పెట్టిందంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో, కన్నడ నిర్మాతల సంఘం మూడేళ్ల పాటు నిఖితను సినిమాల్లో తీసుకోకూడదని నిషేధం విధించింది. ఆ నిర్ణయంపై నిఖిత స్పందిస్తూ దర్శన్ సరసన నేను నటించాను. ఆయనతో నా స్నేహం కేవలం వృత్తిపరమైనది మాత్రమే. వేరే ఎలాంటి అనుబంధం లేదు.

గత ఆరేళ్లుగా నేను అనేక భాషల్లో సినిమాలు చేశాను. నాపై ఇలాంటి ఆరోపణలు లేవు. అటువంటిది కన్నడంలో నాపై ఓ హీరో కుటుంబ విషయంలో నిషేధం విధించడం భావ్యం కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఖుష్బూ మాటలకు ఊతమిస్తూ... నిఖితతో కాటన్ పెట్ అనే కన్నడ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఓంప్రకాశ్‌రావు కూడా ఆమెను సపోర్ట్ చేశారు. నిర్మాతల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించనని ఆయన పేర్కొన్నారు. అలాగే కన్నడ రంగానికి చెందిన మరికొంతమంది దర్శకులు, నటులు కూడా నిఖితను సపోర్ట్ చేస్తున్నారు. మరికొన్ని సంఘాలవారు కూడా నిఖితకే మద్దుతునిస్తున్నాయి. నిఖితకు కన్నడ నిర్మాతలు చాలా పెద్ద శిక్ష విధించారని మరికొంతమంది ప్రముఖులు కూడా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఖిత, దర్శన్‌ల మధ్య చోటుచేసుకున్న విషయం ఎటువంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలంటున్నారు








No comments: