Thursday, January 21, 2010

OM SHANTHI MOVIE REVIEW...........




ఓం.......... (అ) శాంతి.................


FINAL ANALYSIS : GOOD MOVIE but FLOP due to wrong time release...........


శేషు ప్రియాంక చలసాని నిర్మించిన ‘ఓం శాంతి’ చిత్రం ప్రేక్షకులకు అశాంతినే కలిగిస్తోంది. ఐదు కథలు..ఐదు పాత్రలు..ఒక నిజం కానె్సప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నత్తనడక నడిచి ఏ వర్గాన్నీ మెప్పించలేకపోతోంది. తొలి చిత్రం ‘బాణం’ సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకోకపోయనా, విమర్శకుల ప్రశంసలైనా దక్కాయ. కానీ ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించలేక పోతోంది.............


ఐ.టి కేంద్రంగా అక్కడి సంగతులు వగైరా దృశ్యీకరించడంలో డైరెక్టర్ ప్రకాష్ మంచి ప్రజ్ఞ చూపారు. అందుకు ఆయనకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నేపథ్యం పనికొచ్చింది. అలాగే మేఘన పాత్ర తీర్చిదిద్దడంలోనూ దర్శకుడు కృతకృత్యమయ్యారు. ఇప్పటి యువతరం థ్రిల్లింగ్‌కోసం పరితపించే తీరు ఇది కళ్లకు కట్టింది. ఈ పాత్ర పోషణలో తిరిగి కాజల్ మళ్లీ మంచి మార్కులు కొట్టేసింది. రేడియో జాకీగా మాధవన్ పాత్ర నిడివి తక్కువైనా (అతిథి పాత్ర) అతని ఉనికి సినిమాకు అదనపు బలం కలగచేసింది. ఎన్.ఆర్.టి (నెక్స్ట్‌టు రవితేజ)గా నిఖిల్ ఉన్నంతసేపు తెగ అల్లరి చేసేశాడు. సునీల్ కఠారియాగా కూడా అక్కడక్కడ కనిపించినా ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు. అంజనిగా అదితిశర్మ చాలా సహజంగా నటించగా అతి క్లుప్త పాత్రలో బిందు మాధవి కనిపించింది. నవదీప్ ఓ.కె. శనీశ్వరరావుగా తేజ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే పాత్రలో రఘుబాబు కనిపించి ఓకే అనిపించాడు.................................





PRESENTS



No comments: