Sunday, January 24, 2010

SAMBHO SIVA SAMBHO.......EXCLUSIVE REVIEW







శంభో శివ శంభో............... నైతిక విలువలతో ప్రేమకు కొత్త భాష్యం!



FINAL ANALYSIS : FEEL GOOD MOVIE............Above AVERAGE.......



ఓవరాల్ గా... కొన్ని సినిమాలు పర్స్ బరువును బట్టి చూడొచ్చు. మరికొన్ని మనసుతో...మనసుపెట్టి...సమయం తీరిక చేసుకుని చూడాల్సి ఉంటుంది. 'శంభో శివ శంభో' నిశ్చయంగా రెండో కేటగిరిలోకి వస్తుంది.......




మనిషి బతకాలంటే ప్రేమిస్తే సరిపోదు. సంపాదన ఉండాలన్న మాట వాస్తవం. పెళ్లయ్యాక ప్రేమికురాలు కష్టపడి నాలుగు రాళ్లు సంపాదించలేని వాడిని చులకనగా చూస్తుందనేది నిజం. ఈ వాస్తవాలను చిన్న చిన్న సన్నివేశాలతో బాగా చెప్పారు. పెళ్లయ్యాక ప్రేమికులు తమ భాగస్వామిని ఎంత నిర్లక్ష్యం చేస్తారో చూపుతూ వారి ప్రేమ ఆకర్షణ లేక ఆరాధనా అనే విషయాన్ని చర్చించిన విధానం బావుంది.............కొన్ని తమిళ వాసనలు ఈ చిత్రంలో కనిపించాయ. దర్శకత్వపరంగా అతనికి మళ్లీ తీసే అదే కథలో చక్కని పనితనం చూపే ఆవకాశం చిక్కినట్లుగా ఉపయోగించుకున్నాడు. ప్రేమ కథే అయినా సరికొత్త కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందీ చిత్రం...........



PEROFORMANCE



RAVITEJA : మంచి పాత్రలు దొరికితే ఏ నటుడైనా విజృంభిస్తాడని చెప్పడానికి రవితేజ, అల్లరి నరేష్ పాత్రలను చెప్పుకోవాలి........రవితేజ తన నటనలోని పైర్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. స్నేహితుని ప్రేమని నెగ్గించి తన ప్రేమను మాత్రం దక్కించుకోలేకపోయిన త్యాగమయ పాత్రను సమర్ధవంతంగా ఆయన పోషించారు.......రవితేజకూడా చాలా క్లిష్టమైన పాత్రను అవలీలగా చేసిన విధానం మెచ్చుకోకుండా ఉండలేం.............



"అల్లరి" NARESH : తోలి సినిమా నే ఇంటి పేరుగా మార్చుకొని....... అల్లరితోనే అవార్డులు కూడా ఇంటికి పట్టుకువేల్తున్న నటుడు నరేష్...ఈ సారి కూడా ఒక అవార్డు ఖాయం చేసుకున్నాడు....."మల్లి" పాత్రలో ఉన్న నరేష్........మొదట్నించీ చివరి వరరూ గడ్డం, చెదిరిన క్రాఫ్ తో కనిపించిన అల్లరి నరేష్ తన పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన పాత్రలో కామెడీ ప్లస్ ఫైర్ రెండూ ఉన్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే అల్లరి నరేష్ అనే వ్యక్తి కాకుండా అతని పాత్రే కనిపిస్తుంది. 'గమ్యం' తర్వాత మరో అవార్డును ఆయన ఖాయం చేసుకున్నట్టే. .............కొన్ని సన్నివేశాలలో నరేష్ రవితేజను డామినేట్ చేస్తూ నటించాడు. నరేష్‌లో మంచి సీరియస్ నటుడున్నాడన్న విషయం మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. ...........



SIVA BALAJI : శివబాలాజీ తనవరకు బాగా చేసాడు. ......రవితేజ-అల్లరి నరేష్ పాత్రల డామినేషన్ మధ్య శివ బాలాజీ సైతం తన ఉనికిని బలంగా చాటుకుంటూ తన పాత్రకు చక్కటి న్యాయం చేశారు..............



PRIYAMANI : తమిళ సినిమా "పరుత్తివిరాన్" సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న "ప్రియమణి" లో ఇంత మంచి నటి ఉందా అని కచ్చితంగా తెలుగు ప్రేక్షకుడు అనుకుంటాడు......... "మణెమ్మ" పాత్ర లో ఆమె సరిగ్గా సరిపోయింది.....బావను అమితంగా ప్రేమించే మరదలి పాత్రలో ప్రియమణి మంచి అభినయం ప్రదర్శిచింది....ఇందులో ఈమె చేసే మేనరిజం అందరిని ఆకట్టుకుంటుంది..........



ఇంకా........ అభినయ పాత్ర చిన్నదే అయినా చాలా క్యూట్ గా కనపించి అలరించింది. ప్రచారాన్ని అమితంగా ఇష్టపడే ప్రజాబంధు చిట్టినాయుడు పాత్రలో కృష్ణ భగవాన్ అడపాదడపా నవ్వించారు......కృష్ణ్భగవాన్ చేసిన చిట్టి నాయుడు పాత్ర మనకు నిత్యం సమాజంలో కనిపించేదే!......... ప్రేమికుల గొడవల మధ్య ముఖేష్‌రుషి, రోజా పాత్రలు తేలిపోయాయి...........మిత్ర త్రయం స్నేహితుడు నానిగా సునీల్ సైతం తనదైన శైలిలో కొంత హాస్యాన్ని అందించారు.అలాగే రావు రమేష్ కనిపించేది రెండు సన్నివేశాలైనా గుర్తుండిపోయేలా చేసాడు. ముఖ్యంగా ‘స్వంత విషయమా?’ అన్న డైలాగ్ వద్ద గుర్తుండే నటన చేసాడు............



DIRECTOR : దర్శకుడు "పి.సముద్రఖణి" తన ఆలోచనలు నేలపై నిలబడే చేసాడు. రియల్‌స్టిక్‌గా ఆలోచించి పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది.....ఒక్కోసారి కథ స్లో అయిందనిపించి...మళ్లీ వేగం పుంజుకోవడం కనిపిస్తుంది. అయినప్పటికీ సినిమాలో ప్రేక్షకుడ్ని పూర్తిగా ఇన్ వాల్స్ చేయడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు.....



సాంకేతికపరంగా జి.ముట్టయ్య ఛాయాగ్రహణం బాగుంది........ నేపథ్య సంగీతం కొత్తగా సన్నివేశాలకు ఊపునిచ్చేలా సాగింది......కమర్షియల్ సక్సెస్ లు నిర్మాత బెల్లంకొండకు కొత్త కాకపోయినా కేవలం అభిరుచితో ఇలాంటి కథాంశాన్ని ఎంచుకున్నట్టు చెప్పవచ్చు. నిర్మాణ విలువలు కూడా తగనట్టుగానే ఉన్నాయి..................



శంభో శివ శంభో



కరుణాకర్ (రవితేజ) మల్లి (అల్లరి నరేష్), చందు (శివబాలాజీ) ప్రాణస్నేహితులు. ముగ్గురికీ మూడు జీవితాశయాలుంటాయి. అవి నెరవేర్చుకునేందుకు వారి కృషి వాళ్లు చేస్తుంటారు..........



కర్ణ(రవితేజ) తనను అమితంగా ప్రేమించే మరదలు మణెమ్మ (ప్రియమణి)ను పెళ్లాడాలనుకుంటాడు. అయితే మల్లి చేయి అందుకోవాలంటే అతనికి ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరని కాబోయే మామగారు (తనికెళ్ల భరణి) షరతు పెడతాడు. ఆ దిశగా కర్ణ ప్రయత్నాలు చేస్తుంటాడు..........(అల్లరి నరేష్)మల్లి విదేశాలకు వెళ్లిపోవాలనుకుంటాడు......చందు(శివ బాలాజీ) బ్యాంకు రుణం తీసుకుని కంప్యూటర్ సెంటర్ పెట్టడం ద్వారా సెటిల్ కావాలనుకుంటాడు. కర్ణ చెల్లెలు పవిత్ర (అభినయ)ను కూడా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. ............



ఇలా సాగుతున్న ఈ మిత్రుల జీవితంలోకి ఓ కొత్త సమస్య వచ్చిపడుతుంది............కరుణాకర్ పాత స్నేహితుడు సంతోష్ వచ్చి తన విఫల ప్రేమను తెలిపి కర్నూలు ఫ్యాక్షనిస్టు నరసింహారెడ్డి (ముకేష్‌రుషి) కూతురుతో తన ప్రేమను పండించమని వేడుకుంటాడు........... సంతోష్ ఎవరో కాదు......మాజీ ఎంపి భవాని (రోజా) కొడుకు...... ఊహించని విధంగా ఒకరోజు అతను ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో మిత్రులంతా కలిసి కాపాడతారు.......ఆ ప్రేమజంటను కలపడం ప్రమాదంతో కూడుకున్నదే అయినా మిత్ర త్రయం అందుకు సిద్ధపడుతుంది. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి ప్రభను ఎత్తుకు వచ్చే ప్రయత్నంలో కర్ణ కంటిపై పొడవాటి కత్తి చీరుకుపోతుంది. మల్లిని ఒకడు పొడవాటి ట్యూబ్ తో కొట్టడంతో అతి చెవికి బలంగా తాకి వినికిడి శక్తి కోల్పోతాడు. చందు కాలిపై ఓ లారీ ఎక్కడంతో అది నుజ్జునుజ్జు అయిపోతుంది. సంతోష్, ప్రభకు పెళ్లి చేసి అజ్ఞాత ప్రదేశానికి కర్ణ పంపించేస్తాడు...............



INTERVAL



కర్ణ, అతని మిత్రులు పోలీసు కేసులో చిక్కుకోవడంతో తన కూతుర్ని కర్ణకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మణెమ్మ తండ్రి ససేమిరా అంటాడు........పోలీసులు- కోర్టుల వెంట తిరిగి గెలిచిన తరువాత మరో ఓటమి ఎదురవుతుంది. అంత కష్టపడి కలిపిన ఆ జంట వ్యామోహం తొలగి కోరికలు తీరీ ఒకరికొకరు అసహ్యించుకుంటూ స్నేహితులు చేసిన త్యాగాన్ని మరచి విడిపోయి ప్రేమను అపహాస్యంపాలు చేస్తారు..........దీంతో తమ త్యాగానికి విలువ లేకపోయిందని గ్రహించిన మిత్రత్రయం ఆ జంటకు బుద్ధి చెప్పేందుకు నిర్ణయం తీసుకుంటారు..........



చివరికి....... కర్ణ మరదలు మణెమ్మ కీ ఆమె తండ్రి వేరే పెళ్లి కీ సిద్ధపడతాడు....... స్నేహితులు కోసం తన ప్రేమ నే త్యాగం చేస్తాడు.......

$ THE END $

ప్రేమజంటను కలపడమనే బలమైన ఎపిసోడ్ తో విశ్రాంతి ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు క్లైమాక్స్ నూ అంతే పట్టుగా చూపి రక్తి కట్టించారు. మరో ప్రేమజంటకు సహాయపడేందుకు మిత్ర త్రయం రెడీ అవడం ద్వారా 'సీక్వెల్'కూ ఛాన్స్ ఉందనే ఫీలర్ ను దర్శకుడు వదిలారు............

No comments: