సంతోష్ (వరుణ్‌సందేశ్) ఓ అనాధ. నలుగురు స్నేహితులతో కలిసి కార్టూన్‌తరహా వస్త్రధారణతో వెళ్ళి కస్టమర్ల బాధలను తమ బాధలుగా భావించి వారిని హ్యాపీహ్యాపీగా ఉండేలా చూస్తాడు. తమ టీమ్‌కు 'కార్టూన్‌గైస్'గా పేరుపెట్టుకుంటారు. పనిలోపనిగా ఎవరినైనా ప్రేమించి జీవితంలో సెటిల్‌అవ్వాలనుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ ప్రేమించరు. వృత్తిలోభాగంగా యు.ఎస్.నుండి వచ్చే పూజ (వేగ)ను ఎయిర్‌పోర్ట్‌నుంచి తీసుకువస్తూ ఎంటర్‌టైన్ చేసే క్రమంలో ఆమె ప్రేమలో పడిపోతాడు. ప్రేమపై సదభిప్రాయంలేని పూజ మంచి స్నేహితునిగా ఉంటానని సంతోష్‌కు చెబుతుంది. స్నేహంతోటే ప్రేమను పొందాలని పలుకరాలుగా సంతోష్ ప్రయత్నిస్తాడు. తనో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతూ ఫీలింగ్స్ అన్నీ పూజకు వ్యక్తం చేస్తుంటాడు. ఓ సందర్భంలో తన డ్రీమ్‌గాళ్‌ను చూపించే ప్రయత్నంలో యాదృశ్చికంగా అటుగా వెళుతున్న ప్రియ (శరణ్యమోహన్)ను చూపిస్తాడు. దీంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి తన ఫ్రెండ్ ఎంతో ప్రేమిస్తూ రాసిన లవ్‌లెటర్స్‌ను ప్రియకు చూపిస్తూ ఆమెను ప్రేమలోకి బలవంతంగా లాగుతుంది పూజ. ప్రేమలేఖల్లో ఉన్న ప్రేమకు ముగ్థురాలై ప్రియ నిజంగా సంతోష్‌ను ప్రేమించేస్తుంది.
ఇది తెలుసుకున్న సంతోష్ తాను ప్రేమిస్తుందని పూజననే విషయాన్ని ప్రియ సోదరుడు సూరి (డబ్బింగ్ బొమ్మాలి రవి)కు చెబుతాడు. అయితే అతని మంచితనానికి మెచ్చిన సూరి తన సోదరికి సరైనవాడు ఇతడేనని భావించి, ఈ నిజాన్ని చెబితే ఎంతోకాలం బతకని ప్రియ ఇప్పుడే చనిపోతుందనీ, అందుకే ప్రేమిస్తున్నట్లు నటించమని ప్రాధేయపడతాడు సూరి. ఈ క్రమంలో ఆమెపై నిజమైన ప్రేమ పెంచుకుంటాడు. మరోవైపు సంతోష్ ప్రేమించింది తననేనన్న విషయం పూజ గ్రహిస్తుంది.......
No comments:
Post a Comment