Thursday, October 28, 2010

'ఆరెంజ్' చిత్రమే నాగబాబు నిర్మించే ఆఖరి చిత్రం..కారణం



చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా మారి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే "ఆరెంజ్" చిత్రం అనంతరం ఆయన నిర్మాతగా రిటైర్ అవుదామనే నిర్ణయానికి వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే బ్యానర్ క్లోజ్ చేయకుండా ఆసక్తి ఉండి బ్యానర్ లేని వారికి తన బ్యానర్ పై సినిమాలు చేసుకునే అవకాశం కలిగిస్తారంటున్నారు. మొదటగా చిరంజీవి  కుటుంబానికి చెందిన హీరో రవితేజతో బయిట నిర్మాతతో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ఇక ఆరెంజ్ చిత్రం బడ్జెట్ అనుకున్న దానికంటే బాగా పెరిగిందని, దాదాపు 35 కోట్లు బడ్జెట్ పెరగటం, నీ మొత్తదనం వల్లే ఇలా అయిందని చిరంజీవి కోప్పడటంతో నాగబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఇక ఆరెంజ్ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా  హీరోయిన్ గా రూపొందింది.
   

No comments: