Thursday, October 28, 2010

బాలీవుడ్ లో తట్ట బుట్ట సర్దేసిన "కట్ట మిట్ట" పిల్ల....కూరలో కరివేపాకుల తీసిపారేసిన బాలీవుడ్ జనం....




ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్ పరిశ్రమలను కొత్త హీరోయిన్ల ప్రవాహం 
ముంచెత్తుండటంతో సీనియర్ నటీమణుల ఛాన్సులు చేజారిపోతున్నాయి. 

తాజాగా త్రిషకు ఇటువంటి చేదు అనుభవాలు ఎక్కువయ్యాయి.

ఆ మధ్య రజినీకాంత్ అల్లుడు ధనుష్ చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఆ అవకాశాన్ని తెల్లపిల్ల తాప్సీ దక్కించుకుంది.

సరే పోనీలే బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని అక్కడికెళ్లిన త్రిషకు శృంగభంగమే.

హిందీ "ఏ మాయ చేసావె" చిత్రంలో కొంత మేర షూటింగ్ పాల్గొన్నప్పటికీ ఏమైందో ఏమోగానీ త్రిష స్థానాన్ని మిస్ టీన్ వరల్డ్ 2008 అమీ జాక్సన్ తన్నుకెళ్లిందట. దీంతో త్రిష దిమ్మెరపోయిందట.

ఏం చేయాలో తెలియక తిరిగి కోలీవుడ్ చెక్కేద్దామన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.

No comments: