గమనిక : ప్రతి రెండు నిమషాలికి ఒకసారి ఈ పేజి నీ రిఫ్రెష్ చేయండి...కొత్త UPDATES కోసం....
విశాఖపట్నం మద్దిలపాలెం లో ఉన్న "INOX" నుంచి మీ కోసం ప్రత్యక్షప్రసారం అందిస్తున్నాం.
సినిమా మొదలు అయింది....
డైలాగ్ కింగ్ "సాయికుమార్" Background Voice తో సినిమా "గోదావరి జిల్లాలో" మొదలుఅవుతుంది.....
గోదావరి యాస తో "సిద్దార్థ్" పరిచయం జరుగుతుంది....ఇప్పటి వరకు మనం లవర్ బాయ్ ల చూసుకున్న సిద్దార్థ్ ఇప్పుడు మనకి పల్లెటూరి వాడిలా కొత్త గ ఉన్నాడు.....
సిద్దార్థ్ పరిచయ పాట....పూర్తిగా కోనసీమ అందాలూ చూపించాడు కొత్త డైరెక్టర్ "రాంబాబు"...
ఆర్య2 లో "రింగా రింగా" పాట సౌండ్ తో మరదలు "ప్రణీత" పరిచయం....ఫుల్ కామెడి
సిద్దార్థ్ కీ మరదలు ప్రణీత కీ క్షణం పడదు....ఎప్పుడూ మరదళ్ నీ ఏడిపిస్తూ ఉంటాడు....సిద్దార్థ్ మీద వాళ్ళ నాన్నకీ చెప్పిన రాజేంద్రప్రసాద్ కూడా నవ్వుతు ఉంటాడు....
మరదలిని ఏడిపించే బావగా రెండో పాట వస్తుంది.....
అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్ సగం సగం చుపిస్తునాడు డైరెక్టర్....సెకండ్ హాఫ్ లో అసలు కథ ఉంటుంది ఏమో...
మళ్ళి మూడో పాట....ఇది కూడా మరదలని ఏడిపించే పాట....
అసలు ప్రేమ కథ మొదలు అవుతుంది....మరదళ్ మీద ప్రేమ పుడుతుంది బావా గారికి....
సినిమా ఇంటర్వల్ కీ వచ్చింది....ఎట్లా వచ్చిందో తెలియదు...అడగకండి....మొదటి సగం మొత్తం పూర్తిగా కామిడి.
ఇంటర్వల్ తర్వాత....
"సింధు తులాని" పరిచయం.సిద్దార్థ్ కీ తెలిసిన మనిషి....
నవ్వుల బ్రహ్మ "బ్రహ్మానందం" పరిచయం....వరుడు సినిమాలో చేసిన పాత్రనే చేసేసాడు.....పెళ్ళిళ్ళ పేరయ్య.....
ఐదో పాట సిల్క్ బట్టల్లో సిద్దార్థ్ నవ్వు తెప్పించే విదంగా ఉన్నాడు.....పాట కూడా బాగుంది.....
సినిమా ఎక్కడో చూసినట్టు ఉంటుంది చూసినప్పుడు......మళ్ళి పాట ...సిద్దార్థ్ పాడిన పాట...బాగుంది వినడానికి....
రాజేంద్రప్రసాద్ లాంటి గొప్ప నటుడు ఎట్లా చేస్తాడో మనకి తెలుసు.....కానీ ఈ సినిమాలో ఆయిన నటన పెద్దగ ఏమిలేదు.....
ఒక్క సిద్దార్థ్ కోసమే చూస్తునట్టు ఉంది....
"బొమ్మరిల్లు" Climax ల ఉంది "బావ" సినిమా Climax ఉంది....కానీ సిద్దార్థ్ మాత్రం సూపర్ గ చేస్తునాడు.....
సినిమా చివరికి ఎం అవుతుందో ముందే మనం ఉహించవచ్చు ....
తనికెళ భరణి చాలా రోజులు తర్వాత మాంచి పాత్ర చేసాడు.....Climax లో అతని పాత్ర చాలా బాగుంటుంది....
బాబోయి! మళ్ళి పాట.....సినిమాలో కథ తక్కువ పాటలు ఎక్కువ.....
సినిమా అయిపోయింది.....బావ మరదలు ఇద్దరు కలిసిపోతారు....
"బావ" కొత్తగా ఏమి లేదు చూడానికి....కోనసీమ అందాలు...కొంచెం కామిడీ....ప్రణీత లంగావోణిలు తప్ప ఏమి లేదు కొత్తగా.....
No comments:
Post a Comment