Wednesday, November 3, 2010

పాపం ఛార్మిని కష్టపెడుతున్న చిరంజీవి రీఎంట్రీ....


 
చిరంజీవి తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇస్తాననటంతో ఆయనతో నటించకుండా మిగిలిన హీరోయిన్స్ ,ఆల్రెడీ నటించిన హీరోయిన్స్ ట్రైల్స్ ప్రారంభించేసారు. అదే రేసులో చార్మీ కూడా ఉందని సమాచారం. అయితే తాను బొద్దుగుమ్మ కావటం ఆ ఛాన్స్ రాకుండా చేస్తుందని భయపడుతోందిట. అందుకోసం బరువు అర్జెంటుగా తగ్గాలని నిర్ణయించుకుందని చెప్తున్నారు.

రీసెంట్ గా చిరంజీవి [^] తన శరీరం బరువును తగ్గించేసుకోవడానికి లండన్‌ వెళ్లి అక్కడ కొందరు నిపుణుల సూచనలు పాటించి తన కొడుకు రామ్‌చరణ్‌కు పోటీగా తయారయ్యారవ్వటానికి ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూటులో ఛార్మి కూడా తన శరీరంలో పేరుకుపోయిన క్రొవ్వుని త్రగ్గించుకునే ప్రయత్నం ప్రారంభించింది. అయితే లండన్ దాకా వెళ్ళకుండా లోకల్ ఉన్నవారిని ఎంకరేజ్ చేసే పనిలో పండిది. హైదరాబాద్ [^]లో అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను ఉపయోగించుకుని స్లిమ్‌ అయ్యేందుకు సిద్ధపడుతోంది. దానికి కారణం ఛార్మికి తీరని కోరికైన చిరంజీవి చిత్రంలో నటించాలనే ఆసక్తేట. ఈ మధ్యన చిరంజివీ రీఎంట్రి చిత్రంకు రెడీ అవుతోండటంతో..తాను కూడా అప్పటికి రెడీ కావాలని ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

అసలు ఏ హీరోయిన్ అయినా చిరంజీవి సరసన నటించాలనుకుంటుందని, తనకూ ఆ కోరిక ఉందని చార్మి [^] చెప్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె తన విజయ ప్రస్ధానాన్ని మళ్ళీ మొదలుపెట్టాలనుకుంటోంది. అయితే సన్నిహితులు ఒళ్ళు తగ్గించకపోతే వర్కవుట్ కాదని కష్టపడి వర్కవుట్స్ చేయమని సలహా ఇచ్చాట్ట. దాంతో తను రేసులో వెనకపడిపోవటానకి కారణం తన ఒళ్ళేనని అర్ధం చేసుకుని తగ్గే ప్రయత్నాల్లో పడింది. అందుకోసం ఛార్మి చాలా కష్టపడి జిమ్‌కు వెళ్లి తన బరువును తగ్గించేసుకుని స్లిమ్‌గా తయారయ్యేందుకు తాపత్రయపడుతోంది. అది ఫలించకపోతే డాక్టర్స్ సలహాతో ద్వారా నెక్ట్స్ స్టెప్ కు వెళ్దామనకుంటోందని చెప్తున్నారు.
 

No comments: