Wednesday, November 3, 2010

ఫ్లాప్ అయితే రెమ్యునేషన్ రిటన్ చేస్తానంటున్న తెలుగు హీరో



అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ...సినిమా ఆడకపోతే తను తీసుకున్న రెమ్యునేషన్ ని వెనక్కి ఇచ్చేసేవారని చెప్తూంటారు. ఇప్పుడు అదే బాటలో యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రయాణం పెట్టుకున్నాడని తెలుస్తోంది. తన సినిమాలు భాక్సాఫీస్ వద్ద కంటిన్యూగా బోల్తా కొట్టడంతో మార్కెట్ పడిపోతోందని భయపడ్డ వరుణ్ ఈ నిర్ణయం తీసుకుని కొత్త నిర్మాత,దర్శకులను ఎట్రాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అ వ్యూహం ఫలించి అతని చేతులో కంటిన్యూగా చిత్రాలు ఉన్నాయి. ఇక ఈ రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చే విషయం ఎగ్రిమెంట్ లోనే ఉండేలా కొందరు నిర్మాతలు అడగారని చెప్తున్నారు. ఓరల్ గా నోటితో అనుకుని రిలీజ్ అయ్యాక కాదు కూడదంటే కష్టమని భావించి ఎగ్రిమెంట్ చెయ్యమంటున్నారట. అయితే తాము తీసే సినిమా ప్లాప్ అయినప్పుడు కేవలం హీరో రెమ్యునేషన్ ఒక్కటే వెనక్కి వస్తే కలిసి వచ్చేదేముంది. సినిమా నిర్మాణ దశలోనే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని గానీ కొందరంటున్నారు.

No comments: