అదిగో తోక..ఇదిగో ‘పులి’ అంటూ పవన్ కళ్యాణ్ ఆఖరికి రెండేళ్ల తరువాత బోన్నుంచి బయటికి వచ్చాడు. గతంలో ఖుషి, జల్సా చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి ‘పులి’గా నిరాశపరిచాడు. తన పాత్ర మాత్రమే చూసుకున్నాడు. మిగతా విషయం గాలికి వదిలేశాడు. దర్శకుడు ఎస్.జె.సూర్య కథలోపం పట్ల దృష్టి సారించలేదు. నవ్వురాని కామెడీతో బలహీనమైన కథతో రీల్ చుట్టేశాడు. మ్యూజిక్ మాస్టర్ రహమాన్ తన మ్యూజిక్ చేయలేదు. సో పాటలు బాగాలేవు. మెచ్చుకునే విషయం అంటే తన పాత్రలో పవన్ నటన, అమ్మ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. కొత్త హీరోయిన్ నికిషాపాటిల్ పాత్ర గాలికి వచ్చిందే, ఆమె స్కిన్ షోకే అంకితం. శ్రీయ పాట అనవసరం. విలన్ దండగ.
ఎంతో గర్వంగా వుంటుందనుకున్న ‘కొమరం పులి’ ఇంత పేలవంగా ఉంటుందనుకోలేదు. ఎంతో హైలెవెల్లో బిల్డప్ ఇచ్చి ఎంతసేపు నాన్‌స్టాప్ స్పీచ్‌లతో అదరగొట్టడం తప్ప సినిమాని ఒక పద్ధతిలో తీయలేదు. పవన్ కల్యాణ్ కోసం తీసిన సినిమా వలన మిగతా పాత్రలు తేలిపోయాయి. ఎంతో పెద్ద విలన్ అన్నారు. చిన్నకారు సంఘ్టనకి అంత లాగడం వంటివి సినిమాని చులకన చేసాఋ. హీరోయిన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పనికిరాని వెకిలివేషాలు. ఎందుకు తీసారో అర్ధం కాదు....
2 comments:
నాయనా మొదటిరోజూ...కొమరంపులి రిలీజై చాలా రోజులయింది. దానిని చీలికలు పీలికలుగా అందరూ చీల్చి చెండాడటం అయిపోయింది. నువ్వు ఇప్పుడే నిద్రలేచి మొదటిరోజు రివ్యూ రాయాల్సిన అవసరముందా...అందులోనూ అన్నీ అచ్చు తప్పులు. (రేనుదేసే కాదు రేణూ దేశాయ్)
దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుంది మీ రివ్యూ . ఇంకెందుకు సచ్చిన పామును చంపడం
Post a Comment