మహేష్ తో తీసిన సినిమాతో బయ్యర్లకి ఖలేజా చూపించడం వల్ల డైరెక్టర్ గా త్రివిక్రమ్ కున్న బ్రాండ్ వేల్యూ అమాంతం పడిపోయింది. ఇన్నాళ్లూ ‘జల్సా’ సక్సెస్ క్రెడిట్ లో కొంత వాటా కొట్టేసిన త్రివిక్రమ్ కి ఇప్పుడది ఇవ్వడానికి కూడా చిత్రలోకం కుదరదంటోంది. కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్ల ‘జల్సా’ అలా ఆడిందని, నిజానికి ఆ సినిమాకే త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఫెయిలయ్యాడని కామెంట్స్ పడుతున్నాయి. ‘ఖలేజా’ డిజాస్టర్ కావడంతో త్రివిక్రమ్ మళ్లీ తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
అంతే కాదు, ఇప్పడు త్రివిక్రమ్ తో దర్శకత్వంలో నటించాలని అనుకున్న వెంకటేష్ కూడా వెనుకాడుతున్నట్టు తెలిసింది. ప్లాప్ డైరెక్టర్ అయినా కానీ సినిమాలు త్వరగా తీస్తాడనే పేరున్న తేజతో వెంటనే సినిమా చేయబోతున్న వెంకటేష్, త్రివిక్రమ్ తో పని చేయడానికి మాత్రం సావాలక్షషరత్తులు విధిస్తున్నాడట. స్ర్కిప్ట్, వర్కింగ్ డేస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పక్కాగా ఇస్తేనే సినిమా స్టార్ట్ చేద్దామని అంటున్నాడట. దీంతో వెంకీ, త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ డౌట్ లో పడింది. ఒకప్పుడు కథ, కథనం, మాటలు అంటే త్రివిక్రమే రాయాలన్నట్టుగా పేరొందిన త్రివిక్రమ్ దర్శకుడిగాను తన పదును చూపించాల్సిన టైమ్ వచ్చేసింది.
1 comment:
dont comment like this.this is a worst habit posting like this admin.
Post a Comment