'నేనుదేవుడ్ని', 'వరుడు' సినిమాలతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆర్య తమిళంలో నటించిన 'బాస్ ఎన్గిర భాస్కరన్' చిత్రానికి అనువాదంగా వస్తున్న 'నేనే అంబానీ' చిత్రం ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్య సరసన నయనతార నటించిన ఈ చిత్రాన్ని యస్ వి ఆర్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా యం.రాజేష్ దర్శకత్వం వహించారు. 'నేనుదేవుడ్ని', 'వరుడు' సినిమాలలో విలక్షణనటనతో ఆకట్టుకున్న 'ఆర్య 'నేనే అంబానీ' చిత్రం ద్వారా వినోదాన్నిపండించే ప్రయత్నం చేసారు. కామెడీ సినిమాలను ఆదరించడంలో ముందుండే తెలుగు ప్రేక్షకులను అంబానీ ఎంతవరకు ఆకట్టుకున్నాడో ఈ సమీక్షలో చూద్దాం...!
కధ:
బాస్ అని స్నేహితులందరూ ముద్దుగా పిలుచుకునే భాస్కరన్(ఆర్య) భాద్యత లేకుండా జులాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వుంటాడు. ఆక్రమంలోనే డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్ అవటానికి 5 సంవత్సరాలుగా దండయాత్ర చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకసారి కాపీకొడుతూ ట్రైనీ ప్రొఫెసర్ గా పనిచేసే చంద్రిక(నయనతార) కు దొరికిపోతాడు. అక్కడ నుండి పరిక్ష పక్కనపెట్టి చంద్రిక వెనకపడుతూ ఉంటాడు. మరోవైపు భాస్కర్ కు అమ్మ, వెటరినరీ డాక్టర్ గా చేసే అన్న, ఓ చెల్లి వుంటారు. భాస్కర్ అన్న, చంద్రిక అక్క ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. ఆ పెళ్ళి తరువాత భాస్కర్ కూడా చంద్రికను పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. కానీ చంద్రికతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఆ పెళ్ళికి ఒప్పుకోరు. ఎందుకంటె భాస్కర్ పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని. దాంతో ఆరునెలల్లోగా నేను అంబానీ అయి చూపిస్తా అని అందరితో చాలెంజ్ చేసి ఇంట్లోనుండి బయటకు వస్తాడు. అక్కడనుండి భాస్కర్ ఏవిధంగా డబ్బు సంపాదించి చంద్రికను పెళ్ళి చేసుకున్నాడు అన్నది మిగతా కధ.
విశ్లేషణ:
నేనే అంబానీ సినిమా చూస్తుంటే గతంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'అ ఒక్కటి అడక్కు' చిత్రాన్ని తలపిస్తుంది. ఓ భాద్యత తెలియని యువకుడు బాద్యత తెలుసుకుని పైకి రావడం అనే అంశానికి దర్శకుడు రాజేష్ హాస్యాన్ని దట్టించి రూపొందించాడు. మొత్తంగా కామెడీ ఫైనే దృష్టి ఉంచడంతో సీరియస్ సన్నివేశాలు కూడా సిల్లీ గా అనిపిస్తాయి. సినిమా చివరివరకు పరవాలేదనిపించినా క్లైమ్యక్స్ రొటీన్ గా వుండటం నిరాశ పరుస్తుంది. ఏది ఎలా ఉన్న ఆర్య నటించిన బాస్కర్ పాత్రని మాత్రం క్లారిటిగా ప్రెజెంట్ చేసాడు. 'నేనుదేవుడ్ని', 'వరుడు' చిత్రాల్లో సీరియస్ పాత్రల్లో కనిపించిన 'ఆర్య' కామెడి చేయడం ఫ్రెష్ గా అనిపిస్తుంది. కాకపొతే సినిమాకి, సినిమాకి వేరు వేరు ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించడంతో ప్రేక్షకులకు గుర్తుండే అవకాశం తగ్గుతుంది. నయనతార నటనకు ఆస్కారమున్న పాత్రలోనే నటించినా పెద్దగా మెప్పించలేదు. ఇక హీరో స్నేహితుడిగా నటించిన సంతానం నవ్వులు పూయించాడు. జీవా ప్రత్యెక పాత్రలో నటించాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ముఖాలే. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు బాగానే వున్నాయి కాని గుర్తుంచుకునే విధంగా లేవు.. వివేక్ హర్షాన్ ఎడిటింగ్, శక్తీ శరవణన్ సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
హాస్యంతో కూడిన కధనం,ఆర్య నటన , సంతానం కామెడీ నేనే అంబానీ సినిమాకి ప్లస్ పాయింట్లు.
మైనస్ పాయింట్స్ :
రొటీన్ క్లైమక్స్ , తెలుగు నేటివిటీ లేకపోవడం, పరిచయంలేని నటినటులు ఈ సినిమాకి మైనస్ పాయింట్స్.
కొసమెరుపు:
ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు, ఈ సినిమాను తెలుగులోకి అనువదించినవాళ్లు ఆ విషయాన్నీ గ్రహించినట్లయితే బాగుండేది.

1 comment:
రాజేష్ గారు విశ్లేషణ బాగుంది.
Post a Comment