నేను నా ఇష్ట ప్రకారం జీవిస్తాను.. 'సాక్షి' లాంటి ఇడియాటిక్ ఛానెల్స్ చేసే ప్రచారాన్ని నేను లెక్క చెయ్యను. నేను ఆరెంజ్ లో నిజమైన పాత్రను చేసాను..నేను దానిని బాగా ఇష్టపడ్డాను" అంటూ 'సాక్షి' ఛానెల్ పై మండిపడుతూ..రామ్ చరణ్ తాజాగా ట్వీట్ చేసారు. ఆయన అంతలా కోప్పపడటానికి కారణం...రామ్ చరణ్ తాజా చిత్రం 'ఆరెంజ్' ని సాక్షి ఛానెల్ వారు డిజాస్టర్ చిత్రం అని తేల్చేయటమే. అంతేగాక వారు ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి చెప్పే స్లోగన్ అయిన సామాజిక న్యాయం ..ఈ సినిమా విషయంలోనూ అమలుపరచాలని డిమాండ్ చేసారు. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు, నిర్మాతలు మొదట తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్ల, ఆ తర్వాత కొడుకు రామ్ చరణ్ వల్ల చాలా లాస్ అయ్యారని వారిని ఆదుకొని సామాజిక న్యాయం చేయాలని సూచించారు. అలాగే ఆరెంజ్ చిత్రం రెండో రోజే ధియోటర్స్ ఖాళీ అయ్యాయని, మూడో రోజుకు చాలా చోట్ల తీసివేసారని ఆరోపించారు. దాంతో రామ్ చరణ్ ఇలా స్పందించారు.
No comments:
Post a Comment