ఒక హిరోకు తన సినిమా ఇలా వుండాలని ఊహించుకుంటాడు. సినిమా ఫ్లాఫ్ అయినా యాక్టింగ్ పరంగా తనకు చెడ్డ పేరు మాత్రం రాకూడదు అనుకుంటాడు. దర్శకుడు ఎన్నో కలలు కంటాడు. తన కలను తెర మీద చూసుకోగల్గితే చాలు అనుకుంటాడు. ఖర్చు గురించి కాని, వర్కింగ్ డేస్ గురించి ఆలోచించరు. ఆలోచించ వలసిన అవసరం కూడా లేదు. వర్కింగ్ డేస్ ను, ఖర్చును కంట్రోల్ చేయవలసిన బాద్యత పూర్తిగా నిర్మాతదే అంటున్నారు సినీ విశ్లేషకులు. బిజినెస్ హీరో దొరికేసాడు అని మొదట ఖర్చు పెట్టడం ఎందుకు తర్వాత ఈ ఉపోద్గాతాలెందుకని టాలీవుడ్ కోడైకూస్తోంది.
ఇందంతా ఎందుకంటే రామ్ చరణ్ తో ‘ఆరెంజ్’ చిత్రం నిర్మించిన మెగా బ్రదర్ నాగబాబును ఈ సినిమా నష్టాల్లో ముంచిందనే వార్తలు వినబడుతున్నాయి. తాజాగా ఈ వార్తకు బలం చేకూరుతోంది. ఫైనాన్షియల్ క్రైసెస్ లో వున్న నాగబాబు తన బంగ్లాను అమ్మకానికి పెట్టాడని సమాచారం. అయితే ఈ సినిమా మిగిల్చిన నష్టం వల్లే నాగబాబు తన బంగ్లాను అమ్ముకుంటున్నాడని మరి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ మెగా బ్రదర్ కి అంత అవసరం లేదని, అతను రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బును బాగా సేవింగ్స్ చేసుకున్నాడని, ఈ బంగ్లా అమ్మటానికి మరేదైనా కారణం ఉండి ఉంటుందని మరికొంతమంది చెప్పుకుంటున్నారు.

No comments:
Post a Comment