రోబోతో ఘన విజయం సాధించిన రజనీకాంత్ తన తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేయబోతున్నాడనేది అందరిలోనూ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే కొందరు స్టార్ దర్శకులు ఆయన్ని కలసి స్టోరీ లైన్స్ నేరేట్ చెయ్యగా రజనీ మాత్రం ఏదీ రిజెక్టు చెయ్యలేదు..ఏదో ఓకే చెయ్యకుండా ఉన్నారు. అయితే తాజాగా ఆయన్ని హిందీ దర్శకుడు రోహిత్ శెట్టి కలసాడని తెలుస్తోంది. గోల్ మాల్ టైటిల్ తో మూడు సినిమాలు విజయం సాధించిన ఈ దర్శకుడు చెప్పిన లైన్ రజనీకి నచ్చిందని, సినిమా చేద్దాం అన్నట్లుగా చెప్పినట్లు బాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే అది హిందీ చిత్రంలో ఓ పాత్ర కోసమని అంతటా వినిపిస్తోంది. గతంలో రజనీకాంత్ హిందీలో ‘హమ్’, ‘చాల్ బాజ్’ వంటి బ్లాక్‌బస్టర్స్‌లో నటించారు. ఆయన నటించిన చివరి హిందీ చిత్రం ‘బులంది’. ఈ చిత్రం 2000లో వచ్చింది. ఇప్పుడి ఆఫర్ ని ఆయన అంగీకరిస్తాడో లేదో చూడాలంటున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి.. ఓ రీమేక్ చిత్రం చేస్తున్నారు. సూర్య హీరోగా తెలుగు,తమిళ భాషల్లో విజయం సాధించిన యముడు చిత్రం రీమేక్ చేస్తున్నాడు. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. మిగతా ఆర్టిస్టులు ఎవరన్నది త్వరలోనే ఫైనలైజ్ కానుంది అన్నారు. అలాగే విలన్ గా ఫ్రకాష్ రాజ్ నే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment