Thursday, January 6, 2011

ఖలేజా, పులి ప్లాప్ అయినందుకే సూరి ఆ ప్లాట్ తీసుకున్నాడా?



కొమురం పులి, ఖలేజా చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ ప్లాట్ లో మద్దెల చెరవు సూరి ఉంటున్న సంగతి తెలిసింది. సూరి హత్య అనంతరం అతను సినిమా రంగంలో పెడుతున్న పెట్టుబడులు ఒక్కొక్తటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలో సూరి ఈ రెండు చిత్రాలుకు పెట్టుబడి పెట్టి ఆ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో ఆ డబ్బు రికవరి నిమిత్తం ఆ ప్లాట్ ని తీసుకున్నాడని, అంతేగానీ శింగనమల రమేష్ అతనికి అద్దెకు కానీ, ప్రీగా గానీ ఆ ప్లాట్ ని ఇవ్వలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రముఖంగా వినపడుతోంది. వీటితో పాటు అతను ఫైనాన్స్ చేసిన సినిమాలకు అతను ఇండైరక్ట్ గా ఇన్వాల్స్ అయ్యాడని, స్టార్స్ కి, టెక్నీషియన్స్ కు కూడా ఇది ఓపెన్ సీక్రెట్ అని అంటున్నారు. అయితే శింగనమల రమేష్ వీటిని ఖండిస్తున్నారు. తాను చెన్నైలో ఉండటం వల్ల తన ప్లాటు ఖాలీగా ఉంటోందని, తన స్నేహితులు పరిచయం చేసిన సూరికి దానిని ఇచ్చానని అంతవరకే అతనితో రిలేషన్ అని చెప్తున్నాడు. అలాగే..కొన్ని విషయాల్లో ఆయన సాయం చేసాడని మాత్రం చెప్పారు. ఏది నిజమో ఏది అబద్దమో చెప్పటానికి సూరి మన మధ్య లేడు. ఉన్నవారెవ్వరూ నిజాలు మాట్లాడి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోరన్నది మాత్రం నిజం.

No comments: