తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అనే సామెత పక్కనున్నవాడే వెన్నుపోటు పొడిచినప్పుడు తటాల్న గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం చలనచిత్రరంగంలో ఇలా వాసాలను లెక్కబెట్టేవారు వందల్లో సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్నారు. సినిమా తీయడానికి నిర్మాత వస్తే...అతనిని మభ్యపెట్టి మాయచేసి ముగ్గులోకి దింపి వారిని నమ్మకంగా దోచుకునేవారు కొంతకాలంగా వారివెంట ఉన్నవారే. వారే ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు అనే పేరుతో చలామణి అవుతారు. ఆ తర్వాత ప్రొడక్షన్ మేనేజర్లు. సినిమాలో నటీనటులు ఎవర్ని తీసుకోవాలి? భోజనాలు ఎక్కడనుంచి తెప్పించాలి. పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అనే తతంగాన్ని అంతా ఆయనే చూసుకుంటాడు. ఆఖరికి పబ్లిసిటీలో ఓ చేయివేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు.
సూట్‌కేసు పట్టుకుని ఫిలింనగర్ వస్తే ఆ వాసన కనిపెట్టేస్తారు వీళ్లు. వీరికి అడ్డా... శ్రీనగర్‌కాలనీకి దగ్గర్లో గల గణేష్ కాంప్లెక్స్. అక్కడ 24క్రాఫ్ట్‌లకు సంబంధించిన వ్యక్తులంతా సాయంత్రానికి పక్షుల్లా చేరతారు. సీరియల్స్ నుంచి సినిమా వరకు ఎవరు కొత్తవారు చేస్తున్నారు. ఎక్కడెక్కడ షూటింగ్‌లు జరుగుతున్నాయనే విషయాలు అక్కడే బహిర్గతమవుతాయి. కోట్లు తీసుకుని సినిమాపై వ్యామోహంతో వచ్చినవాడు కొత్తవాడయితే... ఒక "బకరా" వచ్చాడు. ఫలానా ఊరునుంచి అంటూ... సంభాషించుకుంటారు. సినిమా పూర్తయ్యేలోపు ప్రొడక్షన్ మేనేజర్‌గా చెప్పుకొనే వ్యక్తి ఓ స్థితి( నిర్మాత స్థాయి)కి వస్తాడు.
అదెలాగంటే... చిన్న సినిమాలు తీసేవారు 2 లేదా 3 కోట్లతో సినిమా తీయాలని వస్తారు. దానికి దర్శకుడు బడ్జెట్ ఇస్తాడు. ఆ బడ్జెట్‌లోపు తీస్తామని నమ్మబలుకుతారు. తీరా షూటింగ్ రన్నింగ్‌లో రకరకాల కారణాలతో చాంతాడంత అవుతుంది. ఆల్‌రెడీ నీటిలో నిండా మునిగాక ఇంకా చలేంటంటూ.. రకరకాల విన్యాసాలతో నిర్మాతను రెచ్చగొడతారు. డబ్బులైపోయ్.. అప్పెలా.. అని నిర్మాత అంటే.. మీకేం ఫర్లేదు.. మీరలా ఉండండీ అంటూ క్షణాల్లో సర్దిపెడతారు. అదెలా అంటే... సినిమా ముందుగా ఆడియో రైట్స్, శాటిలైట్స్ అమ్మేస్తే సగం వచ్చేస్తుందని కళ్లముందు సినిమా చూపిస్తారు. దీంతో నిర్మాత ఆశతో మరింత పెట్టుబడి పెడతాడు.
కావాల్సిన నటీనటులు దొరికే సౌలభ్యం ఉన్నా... చాలా బిజీగా ఉన్నారు. షెడ్యూల్ కుదరడం లేదని సాకు చెప్పి.. ఫలానా క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేట్లు మేనేజర్లు పురిగొల్పుతారు. ఇది నిజమేనని భ్రమపడి నిర్మాత ఓకే అంటాడు. ఇలా ప్రతి పనిలో దర్శకుడు, మేనేజర్లు కుమ్మక్కై నిర్మాతను పీల్చుకు తింటారు. అది సినిమా షూటింగ్‌లో తెలీదు. షూటింగ్ పూర్తయి రిలీజ్ టైంలో బాక్సులు బైటకు రాకపోతే అప్పుడు నిర్మాతకు జ్ఞానోదయం అవుతుంది. ల్యాబ్స్‌లో పోస్ట్‌ప్రొడక్షన్స్ పనులు చేసే టైమ్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌తోనో, బార్సుతోనూ నిర్మాత పిచ్చాపాటీ మాట్లాడినప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి.
ఇలా సినిమా తీయాలని వచ్చిన ప్రతి నిర్మాత ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఇవి. ఒక ప్రముఖ హీరో నటించిన చిత్రం ల్యాబ్‌లో ఆగిపోతే ఆ చిత్రానికి పనిచేసి ప్రొడక్షన్ మేనేజర్ సదరు నిర్మాతకు బినామీ పేరుతో అప్పు ఇప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. 'తకిట తకిట' చిత్రాన్ని తీసుకుంటే... భూమిక భర్త భరత్ ఠాగూర్ తాను ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. క్వాలిటీ సినిమా తీయాలని చెప్పేవాడు. దాన్ని అవకాశంగా తీసుకుని సదరు చిత్రం మేనేజర్ వీరిపై గేలం వేశాడు. నమ్మకంగా వారి ప్రొడక్షన్స్ వ్యవహారాలను చూసే మేనేజర్‌గా చేరాడు. తీరా ఆ చిత్రానికి అనుకున్న దానికంటే డబుల్ ఖర్చు అయింది. అయినా ఆశతో మరింత పెట్టాడు.
ఆ సినిమా పూర్తవడానికి 8 నెలలు పట్టింది. ఈలోగా ఈ మేనేజర్ లోబడ్జెట్ చిత్రాన్ని తీసి విడుదల కూడా చేశాడు. దీంతో ఇండస్ట్రీ ఆశ్చర్యానికి గురయింది. మేనేజర్లు నిర్మాతల్నిమోసం చేయడం మామూలేగానీ... మరి ఇంతగానా అంటూ భరత్ ఠాగూర్‌పై సానుభూతి చూపింది. ఒకరకంగా ఇదీ మంచిదే అనేవారూ ఉన్నారు. ఉత్తరాది నుంచి వచ్చిన భరత్‌కు దక్షిణాదివారంటే చులకన భావముండేదంటారు. ఇండస్ట్రీలో ఈ భావం ఎప్పటినుంచో ఉన్నా.. పెద్దగా బయటపడదు. అయితే భతర్ మాత్రం బయటపడుతుంటాడని టాక్. దాన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
ఇదేకాకుండా.. మేనేజర్లు హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు బ్రోకర్లుగా కూడా వ్యవహరిస్తుంటారు. రవితేజ సోదరులుకూడా ఇటువంటి పనే చేశారు. తమకు కావాల్సినపుడల్లా డ్రగ్స్ తీసుకురావడానికి కొంతమందిని నియమించుకున్నారు. అయితే లావాదేవీల్లో తేడాలు రావడంతో వారే డైరెక్ట్‌గా రంగంలోకి దిగి దొరికిపోయారు. లావాదేవీల గొడవల వల్లే పోలీసులకు వీరే ఉప్పు అందించి ఉంటారని మరో వాదన కూడా ఉంది. అదేవిధంగా నటీనటుల వ్యభిచారం కేసు కూడా ఇలాంటి గొడవల్తోనే బయటపడింది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కొత్త వారు సినిమాలు తీయాలంటే భయపడుతున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి చందంగా ఇండిస్ట్రీలో పరిస్థితి ఉందని పలువురు నిర్మాతలు ఇటీవలే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రెసిడెంట్ మాత్రం ముందుగానే అవగాహనతో ఈ రంగంలోకి రావాలనీ, ఆ తర్వాత ఏం జరిగినా తమకు సంబంధంలేదని చేతులెత్తేశారు. అందుకే కొత్త నిర్మాతలు దూకేముందు వెండితెర లోతులు చూసుకుని దూకడం మంచిదంటున్నారు. లేదంటే వారి పనీ తకిట.. తకిటే..!!

ఈ పాటికి అర్ధం అయ్యిఉంటుంది ఆహ! కొత్త బకరా ఎవరో......
No comments:
Post a Comment